Maestro: మాస్ట్రో అఫీషియల్ డేట్ వచ్చేసింది.. హాట్‌స్టార్ ప్రకటించింది.. ఎప్పుడో తెలుసా.!
Maestro Movie: నితిన్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం 'మాస్ట్రో'. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం అఫీషియల్ విడుదల తేదీ వచ్చేసింది.
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న అంధాదున్ సినిమాను ఇప్పుడు తెలుగులో మ్యాస్ట్రోగా రీమేక్ చేస్తున్నారు. బ్లాక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ‘మాస్ట్రో’ సెప్టెంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు సంస్థ ట్విట్టర్ వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.
#Maestro Premiers Sept 17 on HOTSTAR. pic.twitter.com/S0danwjiOV
— Christopher Kanagaraj (@Chrissuccess) August 28, 2021
కాగా, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ‘మాస్ట్రో’ మూవీలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్నా భాటియా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్.సుధాకర్ రెడ్డి-నికిత రెడ్డిలు ఈ మూవీని నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.