Raj Tarun: కింగ్ నాగార్జున చేతులమీదుగా రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్..

యంగ్ హీరో రాజ్ తరుణ్ హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం దక్కడంలేదు.

Raj Tarun: కింగ్ నాగార్జున చేతులమీదుగా రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్..
Raj Tharun
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Aug 29, 2021 | 8:11 AM

Raj Tarun: యంగ్ హీరో రాజ్ తరుణ్ హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం దక్కడంలేదు. సినిమాల్లోకి రాక ముందు షార్ట్ ఫిలిమ్స్‌తో ప్రేక్షకులకు పరిచయమైన ఈ కుర్రహీరో.. ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోగా మారిపోయాడు. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న రాజ్ తరుణ్.. ఆతర్వాత సినిమా చూపిస్తా మామా, కుమారి 21ఎఫ్, ఆడోరకం- ఈడోరకం, రీసెట్‌గా ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాతో ఆకట్టుకున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ కుర్ర హీరో.  ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యాడు. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమాకు ‘అనుభవించు రాజా’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సహకారంతో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా మూవీ రూపొందుతుంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను కింగ్ నాగార్జున చేతులమీదుగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో బ్యాగ్రౌండ్‌లో జాతర జగరుగుతుండగా మెడలో బంగారపు చైన్లు – చేతికి ఉంగరాలు – బ్రాస్ లెట్ ధరించి నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని పందెం కోడిని నెమరుతూ కనిపించాడు రాజ్. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన కాశిష్ ఖాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతం సమకూరుస్తుండగా.. గేయ రచయిత భాస్కరభట్ల సాహిత్యం రాస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. త్వరలోనే సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nagarjuna Akkineni: కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్ ఫోటో గ్యాలెరీ.. మీరు ఒక లుక్ వేయండి..

Maestro: మాస్ట్రో అఫీషియల్ డేట్ వచ్చేసింది.. హాట్‌స్టార్‌ ప్రకటించింది.. ఎప్పుడో తెలుసా.!

PV Sindhu: పీవీ సింధుకు సినీ ప్రముఖుల సన్మానం.. వీడియోను షేర్‌ చేసిన చిరంజీవి

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..