Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaikala Satyanarayana: విషమంగానే కైకాల సత్యనారాయణ ఆరోగ్యం.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల

Kaikala Satyanarayana: టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. పరిస్థితి విషమంగా ఉండటంతో.. శనివారం నుంచి కైకాలకు అపోలో ఆసుపత్రిలో

Kaikala Satyanarayana: విషమంగానే కైకాల సత్యనారాయణ ఆరోగ్యం.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల
Kaikala Satyanarayana
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 21, 2021 | 10:03 PM

Kaikala Satyanarayana: టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. పరిస్థితి విషమంగా ఉండటంతో.. శనివారం నుంచి కైకాలకు అపోలో ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలెటర్‌పై ఆయన చికిత్స అందిస్తున్నారు. తాజాగా అపోలో వైద్యులు ఆదివారం సాయంత్రం కైకాల సత్యనారాయణ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. కైకాలకు చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. కైకాల ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారని, కానీ.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని.. బీపీ లెవల్స్‌ చాలా తక్కువగా ఉండటంతో వాసో ప్రెజర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు బుటిటిన్‌లో వెల్లడించారు. కాగా.. కైకాల సత్యనారాయణ జ్వరంతో శనివారం ఉదయం అపోలోలో చేరారు. కోవిడ్ తర్వాత సత్యనారాయణ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. మల్టీ ఆర్గాన్స్‌ ఫెయిల్‌ అయినట్లు వెల్లడించారు. ఆయన చికిత్సకు ఆశించినంత మేర స్పందించడం లేదని వైద్యులు నిన్న తెలిపారు.

కాగా.. కైకాల సత్యనారాయణ క్షేమంగా తిరిగి రావాలంటూ సినీ ప్రముఖులు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కైకాలను మెగాస్టార్ చిరంజీవి ఆదివారం పరామర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కైకాల సృహలోకి వచ్చారని వెల్లడించారు. చికిత్స అందిస్తున్న క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి సాయంతో కైకాలను పలకరించినట్లు చిరంజీవి తెలిపారు. ఆయన త్వరగా కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగిందని.. తాను పలుకరించినప్పుడు నవ్వుతూ థంప్స్ సైన్ చూపించారని చిరు పేర్కొన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి రావాలని ప్రార్థిస్తున్నానంటూ మెగాస్టార్‌ ట్వీట్ చేశారు.

Kaikala Satyanarayana Lates

Kaikala Satyanarayana Lates

Also Read:

Colliers India: నిరుద్యోగులకు అలెర్ట్.. రియల్ ఎస్టేట్ కంపెనీలో 1000 ఉద్యోగ అవకాశాలు..!

Farmers Protest: మా పోరాటం ఆగేది కాదు.. రైతు సంఘాల మరిన్ని డిమాండ్లు..