Farmers Protest: మా పోరాటం ఆగేది కాదు.. రైతు సంఘాల మరిన్ని డిమాండ్లు..
Farmers Protest: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులను అంచనా వేయడంలో
Farmers Protest: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులను అంచనా వేయడంలో తమ ప్రభుత్వం ఎక్కడో విఫలమైందని.. వారికి క్షమాపణలు చెబుతున్నట్లు మోదీ తెలిపారు. ప్రధాని మోదీ ప్రకటనను అన్ని పార్టీలు, అన్నదాతలు స్వాగతించారు. అయితే.. ప్రధాని మోదీ స్వయంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. రైతు సంఘాలు ఢిల్లీలో చేస్తున్న ఆందోళనను ఇప్పుడే విరమించమంటూ స్పష్టంచేశారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా యూపీలో తదుపరి కార్యచరణను ఆదివారం సాయంత్రం ప్రకటించింది. మూడు వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ ఉభయ సభల్లో అధికారంగా రద్దు చేసి, కనీస మద్దతు ధరపై చట్టం చేసినప్పుడే తమ ఆందోళన విరమిస్తామంటూ రైతు సంఘాలు తేల్చిచెప్పాయి. సాగు చట్టాల రద్దును అధికారికంగా ప్రకటించి మద్దతు ధరపై చట్టం చేయాలంటూ డిమాండ్ చేశాయి. అంతేకాకుండా గత ఏడాది కాలంగా తమపై పెట్టిన పోలీసు కేసులను ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ప్రధాని మోదీ లేఖ రాయనున్నట్లు తెలిపారు.
దీనిపై స్పష్టత వస్తేనే విరమిస్తామంటూ రైతు సంఘాలు స్పష్టంచేశాయి. వ్యవసాయ చట్టాల రద్దుపై రైతు సంఘాలన్నీ చర్చించినట్లు కిసాన్ మోర్చా తెలిపింది. ఆందోళనను ఇంకా కొనసాగించాలని అనుకున్నట్లు తేల్చి చెప్పింది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తదుపరి ఆందోళన కొనసాగుతుందంటూ రైతు సంఘం నేత బల్బీర్ సింగ్ రాజేవల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు బోర్డర్లో మాట్లాడారు. కాగా.. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో లబ్ధి కోసమే బీజేపీ ప్రభుత్వం సాగు చట్టాలపై యూటర్న్ తీసుకున్నట్లు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: