Jan Dhan Accounts: ఖాతాదారులకు ఎస్‌బీఐ షాక్‌.. పొరపాటున వసూలు చేసిన రూ.254 కోట్లు.. బ్యాంకుపై ఫిర్యాదు..!

Jan Dhan Account: ఏప్రిల్ 2017 నుండి డిసెంబర్ 2019 వరకు డిజిటల్ చెల్లింపుల కోసం ప్రధాన మంత్రి జన్-ధన్ యోజన ఖాతాదారుల నుండి వసూలు చేసిన రూ. 164 కోట్ల రుసుమును..

Jan Dhan Accounts: ఖాతాదారులకు ఎస్‌బీఐ షాక్‌.. పొరపాటున వసూలు చేసిన రూ.254 కోట్లు.. బ్యాంకుపై ఫిర్యాదు..!
Follow us

|

Updated on: Nov 21, 2021 | 8:02 PM

Jan Dhan Account: ఏప్రిల్ 2017 నుండి డిసెంబర్ 2019 వరకు డిజిటల్ చెల్లింపుల కోసం ప్రధాన మంత్రి జన్-ధన్ యోజన ఖాతాదారుల నుండి వసూలు చేసిన రూ. 164 కోట్ల రుసుమును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇంకా రీఫండ్ చేయలేదు. జన్-ధన్ ఖాతా పథకంపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)-ముంబయి రూపొందించిన నివేదిక ప్రకారం.. ఈ రుసుము మొత్తాన్ని తిరిగి చెల్లించమని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా, బ్యాంక్ ఖాతాదారులకు ఇప్పటివరకు కేవలం 90 కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి ఇచ్చింది. అయితే బ్యాంకు ఇంకా రూ.164 కోట్ల మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదని నివేదికలు వెల్లడించాయి.

బ్యాంకు తప్పుగా రూ.254 కోట్లను రికవరీ చేసింది: నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 2017 నుండి సెప్టెంబర్ 2020 వరకు జన్-ధన్ పథకం కింద తెరిచిన సాధారణ పొదుపు ఖాతాల నుండి యూపీఐ (UPI), రూపే లావాదేవీలకు బదులుగా ఎస్‌బీఐ రూ. 254 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో ఖాతాదారుల నుంచి ఒక్కో లావాదేవీకి రూ.17.70 చొప్పున బ్యాంకు వసూలు చేసింది. దీనికి సంబంధించి వివరణ కోసం నోటీసులు పంపగా, బ్యాంకు స్పందించలేదు. అయితే, ఎస్‌బీఐ ఇతర బ్యాంకుల మాదిరిగా కాకుండా, జన్ ధన్ ఖాతాదారుల నుండి డిజిటల్ లావాదేవీలకు రుసుము వసూలు చేయడం ప్రారంభించింది. నెలలో నాలుగు కంటే ఎక్కువ విత్‌డ్రాల్‌ల కోసం బ్యాంకు ఒక్కో లావాదేవీకి రూ.17.70 వసూలు చేస్తోంది.

రీఫండ్‌ చేయాలని బ్యాంకులను సీబీడీటీ ఆదేం: ఎస్‌బీఐ చర్యతో డిజిటల్ లావాదేవీలు చేసే జన్ ధన్ ఖాతాదారులను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ వైఖరిపై ఆగస్టు 2020లో ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు అందింది. దీంతో మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆగస్టు 30, 2020న బ్యాంకులకు జనవరి 1, 2020 నుండి అమలులోకి వచ్చేలా ఖాతాదారుల నుండి వసూలు చేసిన రుసుమును రీఫండ్ చేయాలని ఉత్తర్వు జారీ చేసింది. అంతే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి రుసుము వసూలు చేయవద్దని కూడా కోరింది.

ఎస్‌స్‌బీఐ ఇంకా రూ.164 కోట్లు తిరిగి ఇవ్వలేదు: ఎస్‌బీఐ ఫిబ్రవరి 17, 2021న జన్-ధన్ ఖాతాదారుల నుండి డిజిటల్ లావాదేవీల కోసం వసూలు చేసిన రుసుమును రీఫండ్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఖాతాదారులకు ఇంకా రూ.164 కోట్లు తిరిగి రావాల్సి ఉందని నివేదికను రూపొందించిన స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ ఆశిష్ దాస్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Assets Auction: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌ ఆస్తుల వేలం..!

LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారుడు మరణిస్తే డబ్బులు క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా..?

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!