Assets Auction: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టీఎన్‌ఎల్ ఆస్తుల వేలం..!
Assets Auction: టెలికం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టీఎన్‌ఎల్‌కు సంబంధించిన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం వేలం ప్రకటించింది. అయితే..
Assets Auction: టెలికం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టీఎన్‌ఎల్‌కు సంబంధించిన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం వేలం ప్రకటించింది. అయితే రాష్ట్ర, జిల్లా, ఇతర ప్రాంతాల్లో ఉన్న స్థలాలను విక్రయించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. అయితే టెలికం ఆదాయం తగ్గిపోవడంతో ఆస్తుల విక్రయం వల్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ రెండు సంస్థల ఆస్తులను ప్రభుత్వం దాదాపు రూ.1,100 కోట్ల వరకు సేకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే రెండు సంస్థలకు చెందిన ఆస్తుల విక్రయ జాబితాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.
వీటి ఆస్తుల విక్రయం జాబితాలో హైదరాబాద్, కోల్‌కతా, ఛండీగడ్, భావనగర్ నగరాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ ఆస్తులను రూ.800 కోట్ల రిజర్వ్ ఫ్రైజ్‌కు వేలం వేయనున్నట్లు సమాచారం. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఉంచిన డాక్యుమెంట్ల వివరాల ప్రకారం.. ముంబైలోని వాసరి మిల్, గోరేగావ్‌లో ఉన్న ఎమ్‌టీఎన్‌ఎల్ ఆస్తులను ఆదాపు రూ.270 కోట్ల రిజర్వ్ ధరకు విక్రయించడానికి జాబితాను తయారు చేసింది. ఎమ్‌టీఎన్‌ఎల్ 20 ప్లాట్లను కూడా కంపెనీ అసెట్ మానిటైజేషన్ ప్లాన్‌లో వేలానికి పెట్టింది. అలాగే రివైవల్ స్కీమ్ కింద బీఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టీఎన్‌ఎల్ కంపెనీలకు రూ.69 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రం అక్టోబర్ 2019లో నిర్ణయించింది. వాటి ఎంటీఎన్‌ఎల్ ఆస్తుల వేలం డిసెంబర్ 14న జరగనుంది.
ఇవి కూడా చదవండి: