Electric Scooter: భారత మార్కెట్లో విడుదల కానున్న మరో ఎలక్ర్టిక్‌ స్కూటర్‌.. తక్కువ ధరల్లోనే..!

Electric Scooter: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాహనదారులు కూడా ఇలాంటి వాహనాలు కొనుగోలు..

Electric Scooter: భారత మార్కెట్లో విడుదల కానున్న మరో ఎలక్ర్టిక్‌ స్కూటర్‌.. తక్కువ ధరల్లోనే..!
Follow us

|

Updated on: Nov 21, 2021 | 6:58 PM

Electric Scooter: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాహనదారులు కూడా ఇలాంటి వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ప్రముఖ బైక్‌ రెంటల్‌ సర్వీసెస్‌ స్టార్టప్‌ బైన్స్‌ త్వరలో ఇండియా మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాన్ని విడుదల చేయనుంది. అయితే డిసెంబర్‌ 2న ఈ వాహనాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే అదే రోజు బుకింగ్స్‌ కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం.

రూ.499తో ప్రీ బుకింగ్‌: ఈ వాహనం కొనుగోలు చేయాలనుకునేవారు రూ.499 చెల్లించి ప్రీ బుకింగ్‌ను చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ వాహనాలను బుకింగ్‌ చేసుకున్న వారికి 2022 జనవరిలో డెలివరీ చేయనున్నట్లు తెలిపింది.

22మోటార్స్‌తో ఒప్పందం: కాగా, 22 మోటార్స్‌తో సుమారు 7 మిలియన్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లో 22మోటార్స్‌ తయారీ ప్లాంట్‌ను సైతం కొనుగోలు చేసింది. ఈ ప్లాంట్‌ ఏడాదికి 180,000 స్కూటర్లను తయారు చేసే కెపాసిటీ ఉంది. ఇక ఈ బైక్‌ ధర విషయానికొస్తే సుమారు రూ.75 వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

Whatsapp Chats: మీ వాట్సాప్‌ నుంచి డేటా డిలీట్‌ అయ్యిందా..? టెన్షన్‌ లేదు.. ఇలా బ్యాకప్‌ చేయండి..!

Flight Light: విమానం టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో ఫ్లైట్‌ లైట్లు ఎందుకు డిమ్‌ అవుతాయో తెలుసా..?