- Telugu News Photo Gallery Business photos Know why flight light goes dim while taking off and landing check here all details
Flight Light: విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఫ్లైట్ లైట్లు ఎందుకు డిమ్ అవుతాయో తెలుసా..?
Flight Light: సమయాన్ని ఆదా చేసుకునేందుకు చాలా మంది విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటారు. చాలా మంది విమాన ప్రయాణం చేసే ఉంటారు. కానీ కొన్ని సార్లు విమానం టేకాఫ్ అయినప్పుడు..
Updated on: Nov 20, 2021 | 5:30 PM

Flight Light: సమయాన్ని ఆదా చేసుకునేందుకు చాలా మంది విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటారు. చాలా మంది విమాన ప్రయాణం చేసే ఉంటారు. కానీ కొన్ని సార్లు విమానం టేకాఫ్ అయినప్పుడు లైట్స్ డిమ్ అవడాన్ని మీరు గమనించి ఉంటారు. అయితే ఫ్లైట్ టేకాఫ్ , ల్యాండింగ్ సమయంలో లైట్లు ఎందుకు డిమ్ అవుతాయి అని మీరు ఎప్పుడైనా గమనించారా..?

విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో లైట్లు డిమ్ చేయబడతాయి. ఎందుకంటే మన కళ్లు కాంతికి అనుగుణంగా ఇలా చేస్తారు. కళ్లకు ఎఫెక్ట్ కాకుండా లైట్లను డిమ్ చస్తారు.

కాంతి నుంచి చీకటికి లేదా చీకటి నుంచి కాంతికి సర్దుబాటు కావడానికి మన కళ్లు 10 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. కానీ కాంతి మసకబారితే కళ్లకు కాంతిని సర్దుబాటు చేసేందుకు తక్కువ సమయం పడుతుంది. అందుకే లైట్ల కాంతిని తగ్గిస్తారు.

టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరగడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. అందుకే ఎమర్జెన్సీ డోర్లు, ఎగ్జిట్ లైటింగ్ సులువుగా కనిపించేలా ముందుగానే లైట్లను డిమ్ చేస్తారు.

2006, 2017 మధ్య బోయింగ్ ఎయిర్‌లైన్ అనుభవ వివరాల ప్రకారం.. టేకాఫ్ అయిన మొదటి 3 నిమిషాల్లోనే 13 శాతం ప్రమాదాలు జరిగాయి. ల్యాండింగ్‌కు 8 నిమిషాల ముందు 48 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి.





























