- Telugu News Photo Gallery Business photos Hyundai santro maruti celerio eeco are unsafe vehicles in indian market
Car Crash Test: ఈ మూడు వాహనాలు క్రాష్ టెస్ట్‌లో విఫలం.. భద్రత లోపాలు.. జీరో రేటింగ్..!
Car Crash Test: ప్రస్తుతం కారు కొనుగోలు చేసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే కారు కొనే ముందు ఏ కారుకు ఎలాంటి రేటింగ్ ఉంది.. ఎలాంటి ఫీచర్స్ ..
Updated on: Nov 19, 2021 | 6:49 PM

Car Crash Test: ప్రస్తుతం కారు కొనుగోలు చేసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే కారు కొనే ముందు ఏ కారుకు ఎలాంటి రేటింగ్ ఉంది.. ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి.. మన్నిక, మైలేజీ తదితర వివరాలు తెలుసుకుంటాము. ఇందులో భాగంగా కొన్ని కార్లు క్రాష్ టెస్ట్‌లో విఫలం అయ్యాయి. అలాంటి కార్లకు అధ్వాన్నమైన రేటింగ్ పొందాయి. అలాంటివి హ్యుందాయ్ శాంత్రో, మారుతీ, సెలెరియో, ఈకోలు భారత మార్కెట్లో అంత సురక్షితం కావని తేలింది.

మారుతి సెలెరియో: ఈ కారు 5 డోర్ల హ్యాచ్‌బ్యాక్ కారు. గ్లోబల్ NCAP 1019 కిలోల సెలెరియో బేస్ వేరియంట్‌ను క్రాష్ టెస్ట్ చేసింది. పరీక్ష సమయంలో కారు 64 కిలోమీటర్ల వేగంతో పరీక్షించారు. రేటింగ్ గురించి చెప్పాలంటే ఈ కారు జీరో స్టార్ రేటింగ్ పొందింది. ప్రసిద్ది చెందిన ఈ కారు పిల్లల భద్రత విషయంలో కూడా ఏమి లేదని తేలింది. పిల్లల భద్రత రేటింగ్‌లో 1 స్టార్ ఇవ్వబడింది. దీని ధర రూ.4.53 లక్షల నుంచి రూ.5.78 లక్షల మధ్య ఉంది.

హ్యుందాయ్ శాంత్రో: ఈ కారులో అనేక భద్రత సమస్యలు ఉన్నాయి. ఈ కారు డ్రైవర్ సైడ్ వేరియంట్ 2019లో పరీక్షించారు. 1099 కిలోల బరువున్న ఈ వాహనంలో భద్రత కోసం డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎస్‌బీఆర్, ఏబీఎస్ వ్యవస్థను అమర్చింది కంపెనీ. అదనంగా దాని బాడీ షేల్ ఇంటర్‌సిటి కూడా అస్థిరంగా ఉంది. ఇది 2 స్టార్ రేటింగ్ మాత్రమే పొందింది. ఇది మారుతి సెలెరియో కంటే కొంత మెరుగైనది.

మారుతి ఈకో: ఈ వాహనం 7 సీట్లు కలిగి ఉంటుంది. ఇందులో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే నాన్ - బ్యాగ్ వేరియంట్ 2016లో పరీక్షించబడిందీ. దీని బరువు 1124 కిలోలు. వాహన వేరియంట్‌లలో ఏ విధమైన భద్రతా లక్షణాలు కనిపించలేదు. ఇది అడల్ట్ సేఫ్టీ రేటింగ్ జీరో స్టార్ అలాగే కోల్డ్ సేఫ్టీ రేటింగ్‌లో 2 స్టార్‌లను అందుకుంది.





























