- Telugu News Photo Gallery Business photos Uber launches Auto and Car services in Warangal, hits 100th city milestone
Uber: వరంగల్లో క్యాబ్ ఉబర్ సేవలు.. మైలు రాయిని సాధించిన సంస్థ.. మంత్రి కేటీఆర్ అభినందనలు
Uber Services: ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబర్ తెలంగాణలోని వరంగల్‌లో తన సేవలను ప్రారంభించింది. వరంగల్‌లో ముందుగా ఆటో, కార్ బుకింగ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది..
Updated on: Nov 18, 2021 | 8:37 PM

Uber Services: ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబర్ తెలంగాణలోని వరంగల్‌లో తన సేవలను ప్రారంభించింది. వరంగల్‌లో ముందుగా ఆటో, కార్ బుకింగ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలో ఈ క్యాబ్ సంస్థ వందో నగరానికి తన సేవలను విస్తరించింది. అయితే ఈ మైలు రాయి సాధించిన ఉబర్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు.

వరంగల్ ప్రజల కోసం ఎంతో ఉపయోకరమైన రైడ్‌షేరింగ్ సేవలను ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈజీ, స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ స్మార్ట్ సిటీల నిర్మాణానికి కేంద్రంగా ఉన్నాయని, మూడు అర్బన్ నగరాలైన కాజీపేట, హన్మకొండ, వరంగల్ మధ్య కనెక్టివిటీని పెంచడంలో తెలంగాణ ప్రభుత్వం, ప్రైవేటు సహకారాలు ఎంతో దోహదం చేస్తున్నాయని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్లుగా మిలియన్ల కొద్దీ రైడర్‌లు, వ్యాపారాలు, డ్రైవర్లు, కొరియర్‌లను ఉబర్ కనెక్ట్ చేసిందని ఉబెర్ ఇండియా, సౌత్ ఏషియా సిటీస్ ఆపరేషన్స్ హెడ్ శివ శైలేంద్రన్ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో మరెన్నో మైలురాళ్లను చేరుకునేందుకు ఎదురుచూస్తున్నామని తెలిపారు.

కాగా, 2013లో దేశంలో ఉబర్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 95 మిలియన్ల మంది రైడర్లు, డ్రైవర్లకు సేవలను అందిస్తోంది. ఉబర్ సంస్థ తన సేవలను 200 నగరాలకు విస్తరించాలనే లక్ష్యం పెట్టుకుంది.





























