AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

November 30 Last Date: నవంబర్ 30 లోపు చేయాల్సిన ముఖ్యమైన పనులు.. అవేంటంటే?

పింఛనుదారులు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని(లైఫ్ సర్టిఫికెట్) నవంబర్ 30లోగా సమర్పించాలి. అలా చేయడంలో విఫలమైతే వారి పింఛను నిలిపివేపు అవకాశం ఉంది. ఇది కాకుండా..

November 30 Last Date: నవంబర్ 30 లోపు చేయాల్సిన ముఖ్యమైన పనులు.. అవేంటంటే?
Life Certificate, Lic Home Loan
Venkata Chari
|

Updated on: Nov 21, 2021 | 4:59 PM

Share

నవంబర్ నెలలో చాలా ముఖ్యమైన పనులు చేయడానికి చివరి తేదీ దగ్గరలోనే ఉంది. అంటే నవంబర్ 30లోపు ఈపనులు పూర్తి చేయకుంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అవేంటో వివరంగా తెలుసుకుందాం. పింఛనుదారులు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని(లైఫ్ సర్టిఫికెట్) నవంబర్ 30లోగా సమర్పించాలి. అలా చేయడంలో విఫలమైతే వారి పింఛను నిలిపివేపు అవకాశం ఉంది. ఇది కాకుండా మీరు గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నట్లయితే LIC హౌసింగ్ ఫైనాన్స్ ప్రత్యేక గృహ రుణ ఆఫర్ ఈ నెలతో ముగుస్తుంది.

లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ.. పెన్షనర్లు తమ పెన్షన్ పొందడం కొనసాగించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 30 లోపు వారి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ లైఫ్ సర్టిఫికేట్ అంటే పెన్షనర్ బతికే ఉన్నారనడానికి ఓ బుజువు లాంటింది. పెన్షనర్లు పెన్షన్‌ను పొందడం కొనసాగించడానికి నవంబర్ 30 లోపు వారి జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. తద్వారా వారి పెన్షన్ ఆగిపోకుండా ఉంటుంది.

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్.. మీరు గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నట్లయితే వెంటనే ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోండి. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 2 కోట్ల వరకు గృహ రుణాల కోసం గృహ రుణ రేటును 6.66%కి తగ్గించింది. నవంబర్ 30 వరకు తీసుకున్న గృహ రుణాలపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీని తర్వాత కంపెనీ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది.

జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి.. జవహర్ నవోదయ విద్యాలయంలోని 9వ తరగతిలో ప్రవేశానికి 30 ఏప్రిల్ 2022న నిర్వహించే ఎంపిక పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 30. ఈ తేదీలోపు మీరు నవోదయ విద్యాలయ సమితి (NVS) అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (JNVST) 9వ తరగతిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష 09 ఏప్రిల్ 2022న నిర్వహించనున్నారు. మీ పిల్లలను జవహర్ నవోదయ విద్యాలయంలో చేర్చాలనుకుంటే, వీలైనంత త్వరగా నమోదు చేసుకోవడం మంచింది.

Also Read: 60 వేల మంది ప్రభుత్వ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో పెరగనున్న వేతనాలు..!

LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారుడు మరణిస్తే డబ్బులు క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా..?