60 వేల మంది ప్రభుత్వ జనరల్ ఇన్సూరెన్స్ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో పెరగనున్న వేతనాలు..!
PSU Employees: జనరల్ ఇన్సూరెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (PSU)లో పని చేస్తున్న ఉద్యోగులకు ఎట్టకేలకు రాబోయే రోజుల్లో 15 శాతం వేతన సవరణ జరిగే అవకాశం ఉందని..
PSU Employees: జనరల్ ఇన్సూరెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (PSU)లో పని చేస్తున్న ఉద్యోగులకు ఎట్టకేలకు రాబోయే రోజుల్లో 15 శాతం వేతన సవరణ జరిగే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం.. 60 వేల మంది పీఎస్‌యూ ఉద్యోగులకు వేతన సరవణలు 2021లో జరుగుతాయి. అంటే రాబోయే రోజుల్లో వీరికి గుడ్‌న్యూస్ అందే అవకాశం ఉంది. సాధారణంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంటుంది. జనరల్ ఇన్సూరెన్స్ ఉద్యోగులు చివరిసారిగా 2017లో వేతన సవరణ జరిగింది. అందువల్ల వేలాది మంది ఈ వేతన పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల జీఐపీఎస్‌ఏ ఛైర్మన్, న్యూ ఇండియా అస్యూరెన్స్ సీఎండీ అతుల్ సహాయ్ మాట్లాడుతూ.. వేతన సవరణ సమస్య చాలా త్వరగా పరిష్కరిస్తామని, డిసెంబర్‌లో ఉద్యోగులకు వేతన పెంపు ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. ఇక నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ విజయ్ ప్రకాశ్ మాట్లాడుతూ.
బీమా రంగంలో నాలుగు పీఎస్‌యూలు ఉన్నాయి. నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థలలో 60,000 మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. 15 శాతం వేతన సవరణ ఎల్‌ఐసీ తరహాలో ఉండాలని, ఉద్యోగులకు మేలు జరగాలని అన్నారు. దేశంలో అతిపెద్ద బీమా కంపెనీ అయిన ఎల్‌ఐసీ ఇప్పటికే తన ఉద్యోగుల వేతన సవరణను ప్రకటించింది.
ఎల్‌ఐసీ ఉద్యోగుల వేతనాన్ని ప్రభుత్వం 16 శాతం పెంచింది. చివరి పెంపు 2012లో జరిగింది. దీని తర్వాత 2017లో పెరుగుదల ఉండాల్సి ఉంది. వేతన సవరణ జరిగితే ఎల్‌ఐసీకి చెందిన 1 లక్ష మందికిపైగా ఉద్యోగులు ప్రయోజనం పొందుతారన్నారు.
ఇవి కూడా చదవండి: