PM SVANidhi: వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. ఈ స్కీమ్‌ కింద దరఖాస్తు చేసుకుంటే సులభంగా రుణాలు..!

PM SVANidhi: వ్యాపారులు, వీధి వ్యాపారులు తమతమ వ్యాపారాన్ని మరింతగా పెంచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. కేంద్ర ప్రవేశపెట్టిన..

PM SVANidhi: వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. ఈ స్కీమ్‌ కింద దరఖాస్తు చేసుకుంటే సులభంగా రుణాలు..!
Follow us

|

Updated on: Nov 20, 2021 | 7:06 PM

PM SVANidhi: వ్యాపారులు, వీధి వ్యాపారులు తమతమ వ్యాపారాన్ని మరింతగా పెంచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలలో పీఎం స్వీనిధి ఒకటి. ఈ పథకాన్ని 2020 జూన్‌ 1న ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం ద్వారా వ్యాపారులు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులు రుణాలను పొంది ఆర్థికంగా ఎదగవచ్చు. అలాగే ఈ పథకం గడువు 2022, మార్చి 31 వరకుఅ అందుబాటులో ఉంటుంంది. అర్హులైన వారికి ఈ స్కీమ్‌ కింద దరఖాస్తు చేసుకుంటే రూ.10 వేలు అందించగా, ప్రస్తుతం రూ.20 వేల వరకు అందిస్తున్నారు. అయితే తీసుకున్న రుణాన్ని విధించిన గడువులోగా సరిగ్గా చెల్లించినట్లయితే వడ్డీ రాయితీ పొందవచ్చు. కేంద్ర సర్కార్‌ వడ్డీ రేటులో 7 శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది. తీసుకున్న రుణాన్ని విధించిన గడువులోగా చెల్లిస్తే మళ్లీ రుణం తీసుకోవచ్చు. రుణం కావాలనుకునే వారు పీఎం స్వనిధి వెబ్‌సైట్‌కు వెళ్లి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

లాభాలు: పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులు రూ.20,000 వరకు వర్కింగ్‌ క్యాపిటల్‌ లోన్‌ పొందుతారు. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించినట్లయితే మరో రుణం పొందేందుకు అర్హులు అవుతారు.

వడ్డీ రేట్లు: ఈ పథకంలో రుణం తీసుకున్న రుణదాతలకు వడ్డీ రేట్లు మారుతుంటాయి. బ్యాంకులలో ఉండే వడ్డీ రేట్లు ఈ స్కీమ్‌లో కూడా అలాగే ఉంటాయి.

రుణ చెల్లింపు కాలం: ఈ పీఎం స్వనిధి కింద రుణం తీసుకున్న వారు ఏడాది పాటు ఈఎంఐ పద్దతుల్లో చెల్లించవచ్చు. ముందస్తు చెల్లింపు ఛార్జీలు ఏమి ఉండవు.

వడ్డీ రాయితీ: పీఎం స్వనిధి కింద రుణం పొందిన వారికి 7 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. త్రైమాసికానికి వడ్డీ రాయితీ మొత్తం రుణగ్రహీత ఖాతాలో జమ చేయబడుతుంది.

ఎవరెవరు అర్హులు: ఈ పథకం కింద రుణం పొందే వీధి వ్యాపారులు.. 2020 మార్చి 24 లేదా అంతకు ముందు ఎలాంటి రుణాలు కూడా పెండింగ్‌ ఉండకూడదు. అలాంటి వారు ఈ పథకంలో రుణం పొందేందుకు అర్హులు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి: ఈ పీఎం స్వనిధి పథకం అర్హులైన వీధి వ్యాపారులు రుణం పొందవచ్చు. వెబ్‌సైట్ pmsvanidhi.mohua.gov.in ద్వారా లోన్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డు తీసుకుంటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోవడం తప్పనిసరి..!

Nominee: బ్యాంకు ఖాతా.. వివిధ స్కీమ్‌లలో చేరితే నామినీ పేరు ఎందుకు చేర్చాలి? ఒక వేళ నమోదు చేయకపోతే ఏమవుతుంది?