Nominee: బ్యాంకు ఖాతా.. వివిధ స్కీమ్‌లలో చేరితే నామినీ పేరు ఎందుకు చేర్చాలి? ఒక వేళ నమోదు చేయకపోతే ఏమవుతుంది?
Nominee: మీరు ఏదైనా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసినా.. వివిధ రకాల స్కీమ్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ చేసినా.. ఎల్‌ఐసీ, ఇతర జీవిత బీమాలు, ఈపీఎఫ్ తదితరాలలో నామినీ పేరు..
Nominee: మీరు ఏదైనా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసినా.. వివిధ రకాల స్కీమ్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ చేసినా.. ఎల్‌ఐసీ, ఇతర జీవిత బీమాలు, ఈపీఎఫ్ తదితరాలలో నామినీ పేరు నమోదు చేయడం తప్పనిసరి. అయితే.. చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అన్నీ కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావు. కానీ.. పెట్టుబడిదారుడికి అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే నామినీ పేరు చేర్చడం ఎంతో ముఖ్యమని గుర్తించాలి. నిజానికి నామినీ.. చట్టబద్ధమైన వారసులు వేర్వేరు.. పెట్టుబడులు వారసులందరికీ చేరేందుకు.. నామినీ ఒక వారధి మాత్రమే. అంటే.. పెట్టుబడిదారుడికి ఏదైనా జరిగినప్పుడు అతని తరఫున వారసులకు వాటిని బదిలీ చేసే వ్యక్తి అన్నమాట. అందుకే నామినీగా సొంత వారినే కాదు.. బయట వారినీ నియమించుకునే అవకాశం ఉంది.
యజమాని మరణించిన సందర్భంలో.. పెట్టుబడుల విషయంలో అసలు యజమాని మరణించిన సందర్భంలో.. వాటిని అతని వారసులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా అందించేందుకు నామినీ ఉపయోగపడతారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, డీమ్యాట్ ఖాతా, చిన్న మొత్తాల పొదుపు, బ్యాంకు ఖాతాలు, జీవిత బీమా పాలసీలు.. ఇలా ప్రతి చోటా నామినీ పేరు చేర్చడం తప్పనిసరి.
ఒకవేళ ఒక ఖాతాదారుడు నామినీ పేరు రాయలేదనుకుందాం.. ఆ ఖాతాదారుడికి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు బ్యాంకు సంబంధిత వ్యక్తి వారసుల కోసం చూస్తుంది. వారు వచ్చిన తర్వాత వారసత్వ ధృవీకరణను కోరుతుంది. లేదా వీలునామా అవసరమని చెప్పవచ్చు. ఇవన్నీ పూర్తయ్యేనాటికి ఎంతో సమయం పడుతుంది. ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. బ్యాంకు ఖాతాల్లో ఎవరూ పట్టించుకోని సొమ్ము వేల కోట్లల్లో ఉంది. ఈ మొత్తం అంతా నామినీ వివరాలు సరిగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా గుర్తించారు అధికారులు.
నామినీ పేరును మార్చుకోవచ్చు.. ఒక వ్యక్తి వీలునామా రాసినప్పుడు.. నామినీ.. ఆ మేరకు వారసులకు ఆస్తులను అందించాల్సి ఉంటుంది. అంతేకానీ, నామినీగా పేరు రాసినంత మాత్రాన మొత్తం అతనికి/ఆమెకే చెందదు. నామినీ పేరును ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు.
నామినీలు ఎంత మంది ఉండవచ్చు.. బ్యాంకు ఖాతాలో ఒకరిని నామినీగా పేర్కొనవచ్చు. అలాగే ఉమ్మడి ఖాతా ఉంటే.. ఒకరి కంటే ఎక్కువ నామినీలు ఉండవచ్చు. జీవిత బీమా పాలసీల్లో ఎంతమంది నామినీలనైనా పేర్కొనవచ్చు. పాలసీ విలువలో ఎవరికి ఎంత శాతం చెందాలన్నది వివరించాలి. ఈపీఎఫ్‌లోనూ ఇలాంటి వెసులుబాటు ఉంటుంది. డీమ్యాట్ ఖాతాలోనూ ఒకరికంటే ఎక్కువ నామినీలుగా ఉండేందుకు అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి: