Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు గుడ్‏న్యూస్.. పీఎం కిసాన్ స్కీమ్‏లో మరిన్ని బెన్‏ఫిట్స్ .. 10వ విడతలో..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందన్న

PM Kisan: రైతులకు గుడ్‏న్యూస్.. పీఎం కిసాన్ స్కీమ్‏లో మరిన్ని బెన్‏ఫిట్స్ .. 10వ విడతలో..
Pm Kisan
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 19, 2021 | 7:11 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఏడాదికి రూ. 6 వేలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది కేంద్రం. అయితే ఇవి ఒకేసారి కాకుండా.. విడుతల వారిగా నగదును అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పటివరకు ఈపథకంలో భాగంగా 9 విడతలుగా రైతులకు నగదు జమ చేశారు. ఇక పదవ విడత డిసెంబర్ నెలలో రానుంది. నివేదికల ప్రకారం డిసెంబర్ 15న రైతులు పదవ విడత డబ్బులు అందుకోనున్నారు. అయితే ఈ అమౌంట్ ను మరింత రెట్టింపు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లుగా నివేదికలు సూచిస్తున్నాయి. ఈసారి లబ్ధిదారులకు రూ. 2 వేలకు బదులుగా రూ. 4 వేలు ఇవ్వాలని భావిస్తుందట.

అంతేకాకుండా.. పదవ విడతలో రైతులు మరో మూడు ప్రయోజనాలను అందుకోబోతున్నారు. ఇప్పుడు రైతులు ప్రధాన మంత్రి కిసాన్ మన్ దన్ యోజన ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు వారికి ఈ పింఛను పథకాన్ని ప్రారంభించింది కేంద్రం. దీంతోపాటు రైతులు క్రెడిట్ కార్డు నుంచి రుణాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.

పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్.. పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ రైతుల కోసం పీఎం కిసాన్ పథకంతో అనుసంధానం చేయబడింది. ఈ స్క్రీమ్ కింద రైతులకు ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా.. ప్రభుత్వం వారికి సరసమైన ధరలకు రుణాలు అందిస్తుంది. ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ స్వయం-విశ్వాస భారత పథకం క్రింద అనుసంధానించబడ్డాయి. ప్రస్తుతానికి సుమారు 7 కోట్ల మంది రైతులు కేసీసీని కలిగి ఉండగా, మరో కోటి మందిని ఈ పథకంలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో పీఎం కిసాన్ మంధన్ యోజన పథకం కూడా ఉంది. ఇది రైతులకు పింఛను అందిస్తుంది. ఇప్పటికే పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులైతే, వారు పెన్షన్ స్కీమ్ కోసం కొత్త పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. పీఎం కిసాన్ మాన్ దన్ యోజనలో 60 ఏళ్లు నిండిన రైతులు పెన్షన్ పొందవచ్చు. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయస్సు గల రైతులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రైతులకు కనీసం నెలకు రూ. 3000 పెన్షన్ లభిస్తుంది.

పీఎం కిసాన్ ఐడీ కార్డ్.. పీఎం కిసాన్ పథకం నుంచి అందిన డేటా ఆధారంగా రైతుల కోసం పీఎం కిసాన్ ID కార్డ్‌లను రూపొందించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ స్కీమ్ యొక్క ల్యాండ్ రికార్డ్ డేటాబేస్‌కు లింక్ చేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపు కార్డును సృష్టించవచ్చు. ఐడీ కార్డు రూపొందించిన తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పథకాలు రైతులకు సులభంగా చేరతాయి.

Also Read: Shruti Haasan: హాట్ టాపిక్‏గా శ్రుతిహాసన్ రెమ్యునరేషన్.. బాలయ్య సినిమా కోసం అంత డిమాండ్ చేసిందా ?

Bangarraju: బంగార్రాజు డైరీలో ఇంత అందం దాగుందా ?.. వీడియో షేర్ చేసిన చిత్రయూనిట్.. కృతిశెట్టి ఎమోషనల్..