Flipkart Health Care: మరో కీలక స్టెప్ తీసుకున్న ఫ్లిప్‌కార్ట్.. ఇకపై ఆ సేవలు కూడా అందించనుంది..
Flipkart Health Care: వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మరో కీలక అడుగు వేసింది. ఎలక్ట్రానిక్, ఫ్యాషన్ వేర్, హోమ్ ఫర్నీచర్, కిచెన్ వేర్, గ్రాసరీ విక్రయాలు జరుపుతున్న
Flipkart Health Care: వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మరో కీలక అడుగు వేసింది. ఎలక్ట్రానిక్, ఫ్యాషన్ వేర్, హోమ్ ఫర్నీచర్, కిచెన్ వేర్, గ్రాసరీ విక్రయాలు జరుపుతున్న ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు.. హెల్త్‌కేర్ రంగంలోకి అడుగుపెట్టింది. ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ ని ప్రారంభించింది. కోల్‌కతాకు చెందిన సస్తాసుందర్ మార్కెట్‌ప్లేస్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయాలని ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ నిర్ణయించింది. సస్తాసుందర్ ఆన్‌లైన్ ఫార్మసీ, డిజిటల్ హెల్త్ కేర్ ప్లాట్‌ఫామ్ SastaSundar.com ని నిర్వహిస్తోంది. ఇప్పుడు ఇది ఫ్లిప్‌కార్ట్ చేతికి చేరనుంది. అయితే, దీనికి సంబంధించిన డీట్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తుండగా.. ఫ్లిప్‌కార్ట్ గానీ, సస్తాసుందర్ ఎటువంటి సమాచారాన్ని ప్రకటించలేదు. ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ‘‘సస్తాసుందర్‌లో మెజారిటీ వాటాను కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు పూర్తయ్యాయి. తద్వారా ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ పేరుతో ఫార్మసీ రంగంలోకి ప్రవేశించడం జరిగింది.’’ అని ఈ-కామర్స్ దిగ్గజం ప్రకటించింది. కాగా, సస్తాసుందర్‌ను డిజిటల్ హెల్త్ కేర్ ప్లాట్‌ఫామ్‌ను 2013లో బిఎల్ మిట్టల్, రవికాంత్ శర్మ స్థాపించారు.
Flipkart Health Plus ప్రారంభం.. ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది, ఇది ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ యొక్క ఉమ్మడి బలం నుండి ప్రయోజనం పొందుతుంది. Flipkart Health Plus మిలియన్ల మంది భారతీయ వినియోగదారులకు నాణ్యమైన మరియు సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి ప్రయత్నిస్తుంది. సతాసుందర్‌ను 2013లో బిఎల్ మిట్టల్ మరియు రవికాంత్ శర్మ స్థాపించారు.
ప్రస్తుతం 490 ఫార్మసీలు.. SastaSundar.comలో డిజిటల్ హెల్త్‌కేర్, ఫార్మసీ అందుబాటులో ఉంది. దీని నెట్‌వర్క్‌లో ప్రస్తుతం 490 ఫార్మసీలు ఉన్నాయి. దేశంలోని ప్రజలకు చౌకైన, నాణ్యమైన ఔషధాలను అందించడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం. దీని కోసం, కంపెనీ ఏఐ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అయితే, తాజా డీల్‌తో Sasta Sundar.com ఫ్లిప్‌కార్ట్ పాన్ ఇండియా నెట్‌వర్క్ ప్రయోజనాన్ని పొందుతుంది.
రిలయన్స్, అమెజాన్, టాటాలతో పోటీ.. ఆన్‌లైన్ ఫార్మసీలో పోటీ చాలా వేగంగా పెరుగుతోంది. ఈ మార్కెట్‌లో, ఫ్లిప్‌కార్ట్.. రిలయన్స్‌కు చెందిన నెట్‌మెడ్స్, టాటా గ్రూప్‌కు చెందిన 1mg ఫార్మసీ, ఫార్మ్ ఈజీ, అమెజాన్ ఫార్మసీలతో పోటీపడనుంది. కరోనా కాలంలో ఆన్‌లైన్ ఫార్మసీ మార్కెట్ చాలా వేగంగా విస్తరించింది. ఈ కారణంగానే ఈ-కామర్స్ కంపెనీలు ఈ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నాయి.
ఆన్‌లైన్ ఫార్మసీ మార్కెట్ $16 బిలియన్లు.. భారతదేశంలో ఆన్‌లైన్ హెల్త్‌కేర్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి దేశ ఇ-హెల్త్ రంగం విలువ 16 బిలియన్ డాలర్లుగా ఉంటుందని విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం దీని విలువ 1.2 బిలియన్ డాలర్లు. రెడ్‌సీర్ కన్సల్టింగ్ నివేదిక ప్రకారం.. ఆన్‌లైన్ హెల్త్‌కేర్ రంగం 68 శాతం (CAGR) రేటుతో వృద్ధి చెందుతుంది. అలాగే.. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశ మొత్తం ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ 17 శాతం చొప్పున వృద్ధి చెందుతుంది. అప్పుడు దాని పరిమాణం 353 బిలియన్ డాలర్లు. ఇది జీడీపీలో దాదాపు 7 శాతం ఉంటుంది.
Also read:
Nayanthara: మరో హారర్ థ్రిల్లర్ జోనర్లో నయన్ కొత్త సినిమా.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్..
Nayanthara: నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా.. గాడ్ ఫాదర్ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ ?..