Post Office Account: ఇందులో రూ.500తో ఖాతా ఓపెన్‌ చేయవచ్చు.. మంచి రాబడి, భద్రతా ప్రయోజనాలు..!

Post Office Account: పోస్టల్‌ శాఖలో రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాగే సేవింగ్స్‌ ఖాతాలు కూడా ఉన్నాయి. ఈ పొదుపు ఖాతాల వల్ల ఏదైనా అత్యవసర సమయాల్లో..

Post Office Account: ఇందులో రూ.500తో ఖాతా ఓపెన్‌ చేయవచ్చు.. మంచి రాబడి, భద్రతా ప్రయోజనాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 19, 2021 | 7:16 PM

Post Office Account: పోస్టల్‌ శాఖలో రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాగే సేవింగ్స్‌ ఖాతాలు కూడా ఉన్నాయి. ఈ పొదుపు ఖాతాల వల్ల ఏదైనా అత్యవసర సమయాల్లో ఉపయోగం ఉంటుంది. మీరు ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ పోస్టు ఆఫీసు సేవింగ్స్‌ అకౌంట్‌ ఉపయోగించుకోవచ్చు. చిన్న పొదుపు ఖాతాలలో పెట్టుబడి ప ఎట్టాలనుకునే వారి కోసం ఇండియన్‌ పోస్టు తొమ్మిది వేర్వేరు పొదుపు పథకాలను అందిస్తోంది. ఈ తొమ్మిది పథకాలలో కటి పోస్ట్‌ ఆఫీసు సేవింగ్ అకౌంట్‌ స్కీమ్‌. ఈ పథకం కింద మంచి రాబడుల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పెట్టుబడిదారులు ప్రభుత్వ భద్రత ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

డిపాజిట్‌ మొత్తం ఎంత: పోస్ట్‌ ఆఫీస్‌ సేవింగ్స్‌ ఖాతా పథకం కింద ఒక వ్యక్తి కనీసం రూ.500తో ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. ఇందులో డిపాజిట్‌ పరిమితి అంటూ ఏమిలేదు. అదనంగా మీ ఖాతా నుంచి కనీసం రూ.50 కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఖాతాకు ఎవరెవరు అర్హులు: పోస్ట్‌ ఆఫీస్‌ సేవింగ్స్‌ ఖాతా స్కీమ్‌ కింద 18 ఏళ్లు పైబడిన ఎవరైనా సొంతంగా పొదుపు ఖాతాను తెరవవచ్చు. ఈ పోస్ట్‌ ఆఫీస్‌ పథకంలో ఒక వ్యక్తి ఒకే ఖాతా ఓపెన్‌ చేయవచ్చు. ఈ పథకం కింద తల్లిదండ్రుల తరపున మైనర్‌ ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. ఇందులో జాయింట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

ఎంత వడ్డీ వస్తుంది..? పోస్ట్‌ ఆఫీసు సేవింగ్స్‌ అకౌంట్‌, ఖాతాదారుడు ఏ విధమైన సింగిల్‌ లేదా జాయింట్‌ ఖాతాను ప్రారంభించినా 4 శాతం వడ్డీ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80TTA ప్రకారం.. అన్ని సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలపై రూ.10,000 వరకు వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రతి నెల 10వ తేదీ వరకు, నెలాఖరు వరకు రూ.500 కంటే తక్కువ బ్యాలెన్స్‌ ఉంటే మీకు వడ్డీ చెల్లించబడదు. అంతకన్న ఎక్కువ ఉంటేనే వడ్డీ చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి:

Car Crash Test: ఈ మూడు వాహనాలు క్రాష్‌ టెస్ట్‌లో విఫలం.. భద్రత లోపాలు.. జీరో రేటింగ్‌..!

EPFO e-Nomination: మీ ఈపీఎఫ్‌ ఖాతాకు నామినీ పేరు చేర్చలేదా..? రూ.7 లక్షలు రానట్లే..! పూర్తి వివరాలు