BHIM App: గుడ్‌న్యూస్.. ఆధార్ నంబర్ ఉపయోగించి భీమ్ యాప్ ద్వారా డబ్బులు పంపుకోవచ్చు.. ఎలాగంటే..!
BHIM App: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. గతంలో డబ్బులు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఇంట్లోనే స్మార్ట్‌ఫోన్ ద్వారా బ్యాంకు ఖాతాను..
BHIM App: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. గతంలో డబ్బులు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఇంట్లోనే స్మార్ట్‌ఫోన్ ద్వారా బ్యాంకు ఖాతాను డబ్బులు బదిలీ చేసుకునే సౌలభ్యం వచ్చింది. ఇక టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా సర్వీసులు మరింత సులభతరం అవుతున్నాయి. యూపీఐ ద్వారా లావాదేవీలు జరిపే వారికి గుడ్‌న్యూస్ అందింది. ఇప్పటి వరకు ఫోన్ నెంబర్, బ్యాంకు అకౌంట్ నెంబర్ ఉపయోగించి డబ్బులు పంపుకునేవారు. కానీ ఇక నుంచి ఆధార్ కార్డు నెంబర్‌ను ఉపయోగించి కూడా డబ్బులు పంపుకొనే సౌకర్యం వచ్చేంది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఆన్‌లైన్ పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. కూరగాయల కొట్టు నుంచి పడితే పెద్ద పెద్ద వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అన్ని కూడా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. అయితే ఇలాంటి సదుపాయం కేవలం ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంది.
ఈ నేపథ్యంలో వినియోగదారులకు లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు భీమ్ యాప్ (భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ)ని ఉపయోగించే వారు మొబైల్ లేదా యూపీఐ ఆడ్రస్ లేని వారు ఆధార్ నెంబర్‌ను ఉపయోగించి డబ్బులు పంపుకోవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తెలిపింది. భీమ్ యాప్ అనేది యూపీఐ ఆధారిత యాప్. ఇందులో మొబైల్ నెంబర్, పేరుతో డబ్బులను పంపుకోవచ్చు. ఇక నుంచి భీమ్ యాప్‌లో వినియగదారులు ఆధార్ నెంబర్‌ను ఉపయోగించి డబ్బులను పంపుకోవచ్చు.
ఆధార్ నెంబర్‌తో డబ్బులు ఎలా పంపవచ్చు..? * భీమ్ యాప్‌లో ఆధార్ నెంబర్‌ను ఉపయోగించి 12 అంకెల ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసి వెరిఫై బటన్ నొక్కాలి.
* తర్వాత సిస్టమ్ ఆధార్ లింకింగ్, వినియోగదారుల చిరునామాను ధృవీకరిస్తుంది. దీని ద్వారా డబ్బులను పంపుకోవచ్చు.
* అలాగే చెల్లింపులను స్వీకరించడానికి ఆధార్ పే పీఓఎస్‌ను ఉపయోగించి డిజిటల్ చెల్లింపులు చేయడానికి ఆధార్ నెంబర్, వేలిముద్రను ఉపయోగించాల్సి ఉంటుంది.
* ఒక వేళ ఒక వ్యక్తికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే అన్ని ఖాతాలు ఆధార్‌తో లింక్ చేయబడితే అటువంటి పరిస్థితుల్లో అన్ని ఖాతాలకు డిజిటల్ చెల్లింపులు చేయడానికి ఉపయోగించవచ్చని యూఐడీఏఐ తెలిపింది. ఇలా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్ది సులభతరమైన సదుపాయాలు అందుతున్నాయి. కానీ టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి. అందుకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో జరిపే లావాదేవీల విషయాలలో ఎన్నో మోసాలు జరుగున్నాయి. ఇలాంటి సదుపాయాలను ఉపయోగించే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రోజురోజుకు మానవునికి సదుపాయాలు మరింత సులభతరం అయ్యేందుకు నిపుణులు కొత్త కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే తక్కువ సమయంలోనే లావాదేవీలు జరుపుకోవచ్చు.
ఇవి కూడా చదవండి: