Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. పాత నంబర్లు, పాత ఛార్జీలతో పట్టాలపైకి..

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు ఊరట కలిగిస్తూ.. భారతీయ రైల్వే(Indian Railways) కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కోవిడ్ మహమ్మారి తర్వాత ఇప్పటి వరకు మెయిల్స్..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. పాత నంబర్లు, పాత ఛార్జీలతో పట్టాలపైకి..
Follow us
Subhash Goud

|

Updated on: Nov 19, 2021 | 3:23 PM

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు ఊరట కలిగిస్తూ.. భారతీయ రైల్వే(Indian Railways) కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కోవిడ్ మహమ్మారి తర్వాత ఇప్పటి వరకు మెయిల్స్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ‘ప్రత్యేక రైళ్ల’ ట్యాగ్‌తో నడుపుతున్న భారతీయ రైల్వే.. ఇక నుంచి వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై కరోనాకు మునుపటిలా పాత రైలు నంబర్‌, పాత ఛార్జీలతో మాత్రమే రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. రైల్వేల ప్రకారం, ఇప్పటి వరకు ప్రత్యేక రైళ్లకు కేటాయించిన నంబర్ ‘0’ కూడా తొలగించినున్నట్లు పేర్కొంది. అంటే అన్ని రైళ్లు ప్రీకోవిడ్‌కు ముందు ఎలాంటి నంబర్లతో ప్రయాణించాయి. ఇప్పుడు కూడా అలానే పాత నంబర్లతో నడవనున్నాయి. అలాగే కోవిడ్‌కు ముందు ఉన్న రైల్వే ఛార్జీలే వర్తించనున్నట్లు తెలిపింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ‘ప్రత్యేక’ ట్యాగ్‌ను తొలగించి నడపనున్నట్లు పేర్కొంది. అలాగే మహమ్మారి కంటే ముందు ఉన్న ఛార్జీలనే అమలులోకి రానున్నట్లు రైల్వే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక ట్యాగ్‌ను తొలగించడం ద్వారా అర్హులైన ప్రయాణీకులకు తగిన రాయితీలు లభించనున్నాయి. కరోనా కట్టడిలోకి రావడంతో ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కొన్ని కొన్ని రైళ్లను.. దాదాపు పూర్తిగా పునరుద్దరించడంతో పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. ఈ రైళ్లు నవంబర్‌ 18 నుంచి మార్చిన నంబర్లతో ప్రయాణిస్తున్నాయి. 31 ప్రత్యేక రైళ్లు సాధారణ రైలు సర్వీస్‌గా నడుస్తున్నందున నంబర్లను మార్చింది రైల్వే శాఖ.

1. రైలు నం. 02473, బికనీర్-బాంద్రా టెర్మినస్ రెగ్యులర్ నంబర్ 22473తో నడుస్తుంది. 2. రైలు నెం. 02496, కోల్‌కతా-బికనీర్ రెగ్యులర్ నంబర్ 12496తో నడుస్తుంది. 3. రైలు నం. 02987, సీల్దా-అజ్మీర్ రెగ్యులర్ నంబర్‌ 12987తో నడుస్తోంది. 4. రైలు నం. 02989, దాదర్-అజ్మీర్ రెగ్యులర్ నంబర్‌ 12989తో నడుస్తుంది. 5. రైలు నం. 04711, హరిద్వార్-శ్రీగంగానగర్ రెగ్యులర్ నంబర్‌ 14711తో నడుస్తుంది. 6. రైలు నెం. 04712 శ్రీగంగానగర్-హరిద్వార్ రెగ్యులర్ నంబర్ 14712 నుండి నడుస్తుంది. 7. రైలు నం. 04818, దాదర్-భగత్ కీ కోఠి రెగ్యులర్ నంబర్ 20484తో నడుస్తుంది. 8. రైలు నం. 09612, అమృత్‌సర్-అజ్మీర్ రెగ్యులర్ నంబర్‌19612తో నడుస్తుంది. 9. రైలు నెం. 09614, అమృత్‌సర్-అజ్మీర్ రెగ్యులర్ నంబర్‌ 19614తో నడుస్తుంది. 10. రైలు నం. 09707, బాంద్రా టెర్మినస్-శ్రీగంగానగర్ రెగ్యులర్ నంబర్‌ 14702తో నడుస్తుంది. 11. రైలు నం. 02440, శ్రీగంగానగర్-నాందేడ్ రెగ్యులర్ నంబర్‌ 12440తో నడుస్తుంది. 12. రైలు నెం. 02464, జోధ్‌పూర్-ఢిల్లీ సరాయ్ రోహిల్లా రెగ్యులర్ నంబర్‌ 12464 తో నడుస్తుంది. 13. రైలు నెం. 02467, జైసల్మేర్-జైపూర్ రెగ్యులర్ నంబర్‌ 12467తో నడుస్తుంది. 14. రైలు నం. 02475, హిసార్-కోయంబత్తూరు రెగ్యులర్ నంబర్‌ 22475తో నడుస్తుంది. 15. రైలు నం. 02483, జోధ్‌పూర్-గాంధీధామ్ రెగ్యులర్ నంబర్‌ 22483తో నడుస్తుంది. 16. రైలు నం. 02485, నాందేడ్-శ్రీగంగానగర్ రెగ్యులర్ నంబర్‌ 12485తో నడుస్తుంది. 17. రైలు నం. 02497, శ్రీగంగానగర్ – తిరుచిరాపల్లి రెగ్యులర్ నంబర్‌ 22497. 18. రైలు నెం. 02977, ఎర్నాకులం-అజ్మీర్ రెగ్యులర్ నంబర్‌ 12977తో కొనసాగుతుంది. 19. రైలు నం. 02979, బాంద్రా టెర్మినస్-జైపూర్ రెగ్యులర్ నంబర్‌ 12979తో కొనసాగుతుంది. 20. రైలు నెం. 04703, జైసల్మేర్-లాల్‌ఘర్ రెగ్యులర్ నంబర్‌ 14703తో నడుస్తుంది. 21. రైలు నం. 04704, లాల్‌ఘర్-జైసల్మేర్ రెగ్యులర్ నంబర్‌ 14704 తో నడుస్తుంది. 22. రైలు నం. 04709, బికనీర్ – పూరి రెగ్యులర్ నంబర్‌ 20471తో నడుస్తుంది. 23. రైలు నం. 04717, బికనీర్-హరిద్వార్ రెగ్యులర్ నంబర్‌ 14717తో నడుస్తుంది. 24. రైలు నెం. 04718, హరిద్వార్-బికనేర్ రెగ్యులర్ నంబర్ 14718తో నడుస్తుంది. 25. రైలు నం. 04722, అబోర్-జోధ్‌పూర్ రెగ్యులర్ నంబర్. 14722 తో నడుస్తుంది. 26. రైలు నెం. 04738, తిలక్ బ్రిడ్జ్ – భివానీ రెగ్యులర్ నంబర్ 14738 తో నడుస్తుంది. 27. రైలు నం. 04739, ఢిల్లీ సరాయ్ రోహిల్లా-బికనీర్ రెగ్యులర్ నంబర్  22463 తో నడుస్తుంది. 28. రైలు నం. 04804, సబర్మతి-భగత్ కీ కోఠి రెగ్యులర్ నంబర్ 14804 నెంబర్‌తో నడుస్తుంది. 29. రైలు నం. 04812, ఢిల్లీ సరాయ్ రోహిల్లా – సికార్ రెగ్యులర్ నంబర్‌ 14812 తో నడుస్తుంది. 30. రైలు నెం. 04820, సబర్మతి-భగత్ కీ కోఠి రెగ్యులర్ నంబర్ 14820 తో నడుస్తుంది. 31. రైలు నం. 09684, చండీగఢ్-అజ్మీర్ రెగ్యులర్ నంబర్‌ 12984 తో నడుస్తుంది.

ఇవి కూడా చదవండి:

Fact Check: కేంద్ర ప్రభుత్వం మహిళల ఖాతాల్లో రూ.2.20 లక్షలు జమ చేస్తోందా..? ఇందులో నిజమెంత..?

Digilocker: మీ ఫోన్‌లో ఈ ఒక్క యాప్‌ ఉంటే చాలు.. అన్ని డాక్యుమెంట్లు భద్రంగా దాచుకోవచ్చు..!

విశాఖ రైల్వే జోన్‌ ప్రక్రియలో మరో ముందడుగు.. కీలక ప్రకటన
విశాఖ రైల్వే జోన్‌ ప్రక్రియలో మరో ముందడుగు.. కీలక ప్రకటన
సమ సప్తకంలో వక్ర గ్రహాలు.. ఆ రాశుల వారికి శుభ యోగాలు
సమ సప్తకంలో వక్ర గ్రహాలు.. ఆ రాశుల వారికి శుభ యోగాలు
అల్లు అర్జున్, శ్రీలీల కిస్సిక్ సాంగ్.. ఏయే భాషలో ఎవరు పాడారంటే ?
అల్లు అర్జున్, శ్రీలీల కిస్సిక్ సాంగ్.. ఏయే భాషలో ఎవరు పాడారంటే ?
రాజ్ భవన్‌లో సొంత విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్..!
రాజ్ భవన్‌లో సొంత విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్..!
మ‌ద్యం కిక్కులో ట్రాఫిక్ పోలీసుల‌కు చుక్కలు చూపించిన మందుబాబు
మ‌ద్యం కిక్కులో ట్రాఫిక్ పోలీసుల‌కు చుక్కలు చూపించిన మందుబాబు
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు.. ఎవరి వ్యూహం వారిదే..
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు.. ఎవరి వ్యూహం వారిదే..
టాలీవుడ్ రేసులో భాగ్య శ్రీ బోర్సే దూకుడు.! ఎందుకు ఇంత క్రేజ్.?
టాలీవుడ్ రేసులో భాగ్య శ్రీ బోర్సే దూకుడు.! ఎందుకు ఇంత క్రేజ్.?
ఇంట్లో చెదలు శాశ్వతంగా పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
ఇంట్లో చెదలు శాశ్వతంగా పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మొన్న రూ. 8 కోట్లు.. కట్‌చేస్తే.. నేడు రూ. 23 కోట్లకు పైగానే
మొన్న రూ. 8 కోట్లు.. కట్‌చేస్తే.. నేడు రూ. 23 కోట్లకు పైగానే
అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆరోజు నుంచే స్ట్రీమింగ్
అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆరోజు నుంచే స్ట్రీమింగ్
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.