Iron Problems: మీ శరీరంలో ఈ లక్షణాలు ఉంటే ఐరన్ లోపించినట్లే.. పరిష్కారం ఏమిటి..? ఎలాంటి ఆహారం తీసుకోవాలి..
Iron Problems: అనారోగ్యం బారిన పడేందుకు రకరకాల కారణాలు ఉంటాయి. శరీరంలో రక్తహీనత ఉంటే కూడా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శరీరంలో ఐరన్ లోపించడం..
Iron Problems: అనారోగ్యం బారిన పడేందుకు రకరకాల కారణాలు ఉంటాయి. శరీరంలో రక్తహీనత ఉంటే కూడా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శరీరంలో ఐరన్ లోపించడం అనేది చాలా మందిలో తలెత్తుతుంటుంది. అందుకు కారణం హిమోగ్లోబిన్. పోషకమైన ఆహారాలు,మినల్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల ఐరన్ అధికంగా ఉంటుంది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపించకుండా ఉంటుంది. ఇంగ్లండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం.. శరీరంలో ఐరన్ లోపం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ఐరన్ లోపం వల్ల ఎలాంటి సంకేతాలు వెలువడుతాయో వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
► గుండె స్పందనలో హెచ్చుతగ్గులు, అలసట ► శ్వాస ఆడకపోవడం ► శరీరంపై దురదలు ► ఆహారం మింగే సమయంలో ఇబ్బందులు ► శక్తి కోల్పోవడం ► జుట్టు రాలిపోవడం అలాంటి సమస్యలు తలెత్తుతుంటే ఐరన్ సమస్య వచ్చినట్లు గుర్తించాలంటున్నారు వైద్య నిపుణులు. అలాగే మీ చర్మం, గోళ్లపై ఐరన్ లోపం లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి.
ఐరన్ లోపం వల్ల కలిగే నష్టాలు.. మహిళల్లో ఐరన్‌లోపం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రుతుచక్రంలో మహిళలు చాలా రక్తాన్ని కోల్పోతారు. అందుకే మహిళలకు రెండింతల ఐరన్ అవసరం. ఐరన్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చంటున్నారు వైద్యులు.
ఐరన్ ఏ వయసు వారికి ఎంత అవసరం: 18 ఏళ్లు పైబడిన పురుషులకు 8.7 మి.గ్రా 19-50 ఏళ్ల మధ్య వయసున్న పురుషులకు 14.8 మి.గ్రా 50 ఏళ్లుపైబడిన మహిళలకు8.7 మి.గ్రా
మీ శరీరంలో ఐరన్ పెంచే చిట్కాలు: ► ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ► మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత టీ, కాఫీలను తాగడం మానేయాలి. ► రాత్రి భోజనానికి ముందు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి ► విటమిన్ సి కంటెంట్ శరీరం ఐరన్ పెంచేందుకు దోహదపడుతుంది ► విటమిన్ సి ఉన్న కూరగాయలు, పండ్లు తీసుకోవడం ఐరన్ పెరుగుతుంది.
ఐరన్ లోపాన్ని తొలగించేందుకు తినాల్సిన ఆహారాలు: ► బీన్స్ ► సోయాబిన్ ► తృణధాన్యాలు ► కాయగూరలు ► విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు
అయితే విటమిన్-సి అధికంగా ఉండే పండ్లలో ఆరెంజ్ ఒకటని చెప్పాలి. నారింజ జ్యూస్‌ను డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇందులో సిట్రస్ కూడా ఉన్నందున చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్ని పుచ్చకాయ ముక్కలు, దానిమ్మ, పుదీనా ఆకులను తీసుకొని.. వాటికి తేనె, ఉప్పు, నిమ్మరసం కూడా జోడించి జ్యూస్ చేసుకుని తాగడం వల్ల ఐరన్ పుష్కలంగా లభిస్తోంది.