Kidney Problem: కిడ్నీ సమస్యను గుర్తించడం ఎలా..? నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు.. పరిష్కారం ఏమిటి..?

Kidney Problem: ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా ఎందరో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, టెన్షన్‌, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల మానవుడు..

Kidney Problem: కిడ్నీ సమస్యను గుర్తించడం ఎలా..? నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు.. పరిష్కారం ఏమిటి..?
Subhash Goud

|

Nov 18, 2021 | 9:42 PM

Kidney Problem: ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా ఎందరో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, టెన్షన్‌, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల మానవుడు వ్యాధుని కొనితెచ్చుకుంటున్నారు. ముందే కరోనా సమయం.. ఆ మహమ్మారి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉంటే వ్యాధులన్ని చుట్టుముట్టేస్తాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రతియేటా ఎందరో కిడ్నీ వ్యాధులతో ఇబ్బందులకు గురవుతున్నారు. భారత్‌లో ప్రతి ఏటా కొత్తగా రెండున్నర లక్షల మంది వరకు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే ప్రతి ఏటా మూడున్నరకోట్ల మందికిపైగా డయాలసిస్‌ చేయాల్సి వస్తోందని తెలియజేస్తున్నాయి గణాంకాలు. భారతదేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ‘ది లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌’ నివేదిక ప్రకారం.. మన దేశ జనాభాలో 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. వీటన్నింటికి కారణం మనం కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోకపోవడమే.

నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు.. మహిళలైతే పని ధ్యాసలో పడి కిడ్నీల సంగతే మర్చిపోతున్నారు. జీర్ణ వ్యవస్థ నుంచి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్‌ స్థాయిలను నియంత్రిస్తాయి. ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎములకు భరోసా ఇస్తాయి. అయితే కిడ్నీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీల విషయంలో నిర్లక్ష్యం వహించినట్లతే ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.

కిడ్నీ సమస్యను గుర్తించడం ఎలా..? మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా, కాళ్లవాపు బాగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లే గుర్తించాలి. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచుగా వికారం రావడం, వాంతులు చేసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. కిడ్నీల పనితీరు తగ్గితే ఎర్ర రక్తకణాల ఉత్పత్తి మీద ఆ ప్రభావం పడుతుంది. అలసట, మెదడుకు సంబంధిత ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవి తీవ్రమైన సందర్భంలో రక్తహీనత వస్తుంది. కిడ్నీలు ఉండే భాగంలో నొప్పి వస్తుంటుంది. నొప్పితో పాటు కిడ్నీలో ఇన్‌ఫెక్షన్లు, రాళ్లకు కూడా కారణం అయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూడా చల్లగా ఉన్న ఫీలింగ్‌ ఉంటుంది. ఇది కిడ్నీలు సరిగా పని చేయడం లేదనడానికి సంకేతంగా భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం బెటర్‌.

కిడ్నీ సమస్యకు పరిష్కారం ఏమిటీ..? ► రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి

► క్యాప్సికంలో ఉండే విటమిన్‌ఎ, సీ, పోటాషియం తదితర పోషకాలు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి.

► నిత్యం వెల్లుల్లిని ఏదో ఒక రపంలో తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

► బెర్రీలలో ఫైబర్‌, విటమిన్లు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. శరీరంలో ఉండే మలినాలు బయటకు పోయేలా చేస్తాయి.

► ఓట్స్‌, కాలిఫ్లవర్‌, ఉల్లిపాయలు, పైనాపిల్స్‌ కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

► మూత్రం వచ్చినపుడు వెంటనే వెళ్లాలి. లేకపోతే కిడ్నీపై ప్రభావం చూపుతుంది.

ఇవి కూడా చదవండి:

Food Digest: మీరు రోజూ ఈ ఆహార పదార్థాలు తింటున్నారా..? జీర్ణం కావడానికి దేనికి ఎంత సమయం పడుతుంది..!

Diabetes: షుగర్ లెవల్స్ అదుపులో ఉండాలంటే ఈ 7 పండ్లు తినాల్సిందే.. అవేంటంటే?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu