Ravva Laddu: కొత్త తరం కోసం పాత తరం స్వీట్.. టేస్టీ టేస్టీ కొబ్బరి రవ్వ లడ్డు తయారీ..

Ravva Laddu Recipe: చాక్లెట్స్, రకరకాల ఇనిస్టెంట్ స్వీట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సంప్రదాయ వంటలు నేటి తరానికి దూరమయ్యాయనే చెప్పవచ్చు. అయితే నేటి తరానికి..

Ravva Laddu: కొత్త తరం కోసం పాత తరం స్వీట్.. టేస్టీ టేస్టీ కొబ్బరి రవ్వ లడ్డు తయారీ..
Ravvva Laddu
Follow us
Surya Kala

|

Updated on: Nov 19, 2021 | 2:18 PM

Ravva Laddu Recipe: చాక్లెట్స్, రకరకాల ఇనిస్టెంట్ స్వీట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సంప్రదాయ వంటలు నేటి తరానికి దూరమయ్యాయనే చెప్పవచ్చు. అయితే నేటి తరానికి అప్పటి తీపి రుచులను చూపించాలంటే స్వీట్స్ షాప్స్ వైపు దృష్టి సారించాల్సిందే. ఎందుకంటే వాటి తయారీ చాలామందికి గురించి తెలియదు కనుక. అయితే ఈరోజు కొత్త తరం కోసం పాత తరం స్వీట్ సులభంగా తయారు చేసే రవ్వలడ్డు తయారీ విధానం తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు : బొంబాయి రవ్వ – అరకిలో పంచదార -పావు కిలో ఎండుకొబ్బరి పొడి జీడిపప్పు బాదాం పప్పు కిస్మిస్ యాలకుల పొడి నెయ్యి ఒక కప్పు పాలు (కాచి చల్లార్చిన)

తయారీ విధానం: ముందుగా స్టౌ వెలిగించి బాణలి పెట్టి.. దానిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. వేయి వేడి ఎక్కిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పులు, కిస్మిస్ లు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అనంతరం మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని కొబ్బరి తురుముని వేయించుకోవాలి. దీనిని కూడా బాణలి నుంచి తీసుకుని అందులో ఇప్పుడు తీసుకున్న బొంబాయి రవ్వని వేసుకుని స్టౌ మంటను స్విమ్ లో పెట్టుకుని ఎర్రగా కమ్మటి వాసన వచ్చే వరకూ రవ్వని వేయించుకోవాలి. ఈ బొంబాయి రవ్వని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అనంతరం మిక్సీలో పంచదార, యాలకులు వేసుకుని బరకగా ఉండేలా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు వేయించిన రవ్వలో మిక్సీలోని పంచదార పొడి .. వేయించుకున్న జీడిపప్పు, బాదాం, కిస్మిస్, లతో పాటు కొబ్బరి తురుము వేసుకుని కొంచెం పాలు పోసుకుని ఉండలు చుట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కొబ్బరి రవ్వ లడ్డు రెడీ. ఇవి సుమారు ఒక వారం రోజులపాటు నిల్వ ఉంటాయి. పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా తింటారు.

Also Read: గురునానక్ 552 వ జయంతి నేడు.. ఘనంగా జరుపుకుంటున్న సిక్కులు..(photo gallery)