Onion Benefits For Women: ఉల్లిపాయలతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు.. ఈ సమస్యలకు కూడా చెక్..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదనే సామెత గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఉల్లిపాయతో ఎన్నో ప్రయోజనాలు
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదనే సామెత గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఉల్లిపాయతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా ప్రతి వంటకంలోనూ ఉల్లిపాయలను ఉపయోగిస్తుంటాము. కట్ చేసేప్పుడు కన్నీళ్లు పెట్టించినా.. వీటితో కలిగే ప్రయోజనాలు లెక్కలేనివి. వంటల్లో రుచికే కాదు… అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. రక్తం పల్చగా ఉండి కణాలన్నీ ప్రసరించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు.. రక్తం గడ్డకట్టకుండా రక్త కణాలు నుంచి ఎర్ర రక్త కణాలను నిరోధిస్తుంది. అయితే ఇంకా పచ్చి ఉల్లిపాయలలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో క్యాలరీలుకు ఉండడమే కాకుండా.. విటమిన్ సి, బి, ఐరన్, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఉల్లిపాయ జలుబును తగ్గించడంలోనూ సహయపడుతుంది. ఇందులో ఫైటోకెమికల్స్, అల్లియం, అల్లైడ్ డైసల్ఫైడ్ వంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి అల్లిసిన్ తీసుకున్న తర్వాత వాటిని తీసుకుంటాయి. ముఖ్యంగా మహిళలకు ఉల్లిపాయతో అనేక ప్రయోజనాలున్నాయి.
మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ ఉత్పత్తి ఎక్కువగా తగ్గుతుంది. దీంతో స్త్రీల శరీరంలో తక్కువగా కాల్షియం ఉంటుంది. బోలు ఎముకల వ్యాధి సమస్యను నివారించడానికి కాల్షియం సప్లిమేంట్స్ తీసుకోవాలి. కానీ ఈ సమస్యకు ఉల్లిపాయ చక్కగా పనిచేస్తుంది. అలాగే అకాల వృద్దాప్యాన్ని నివారించాలనుకుంటే ఉల్లిపాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, సి, ఈ ఉంటాయి. ఇది చర్మానికి మేలు చేస్తుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. చర్మానికి ఉల్లిపాయను ఉపయోగించుకోవాలి.
ఉల్లిపాయలో యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నందున అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఉల్లిపాయ ఎక్కువగా తీసుకోవడం వలన మొటిమల సమస్య తగ్గుతుంది. ఉల్లిపాయ రసంలో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేస్తే ఫలితం ఉంటుంది. కెరోటిన్ అనే ప్రోటీన్ జుట్టు, గోర్లు, చర్మ సమస్యలను తొలగిస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్ సమృద్ధిగా ఉంటుంది. సల్ఫర్ జుట్టు పెరుగుదలకు సహయపడుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు సమస్యలకు తగ్గించేందుకు ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించాలి.
Also Read: Nayanthara: నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా.. గాడ్ ఫాదర్ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ ?..