విటమిన్ సి, బి-12 లోపం - శరీరానికి విటమిన్స్, ఖనిజాలు చాలా అవసరం. ఇందులో ఏది మిస్సయినా.. లోపం ఏర్పడుతుంది. అప్పుడు మన శరీరం వ్యాధిని తట్టుకోగలిగే సామర్ధ్యాన్ని కోల్పోతుంది. తద్వారా మనం ఇతరుల కంటే ఎక్కువగా వణికిపోతాం. ఇదే పరిస్థితిని మీరు రెండు లేదా మూడు రోజుల నుంచి అనుభవిస్తుంటే.. తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకుని.. డాక్టర్‌ను సంప్రదించండి.