- Telugu News Photo Gallery Cricket photos Who will be the next captain of royal challengers Bangalore which Player can replace virat kohli as rcb captain
Royal Challengers Bangalore: ఆర్‌సీబీ కెప్టెన్‌పై మరోసారి ఆసక్తికర చర్చ.. డివిలియర్స్ రిటైర్మెంట్‌తో తెరపైకి వచ్చిన వారెవరంటే?
AB De Villiers: విరాట్ కోహ్లి IPL తదుపరి సీజన్ నుంచి బెంగళూరుకు కెప్టెన్ గా ఉండనని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఏబీ డివిలియర్స్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్సీబీ తదుపరి కెప్టెన్ రేసు ఆసక్తికరంగా మారింది.
Updated on: Nov 19, 2021 | 4:20 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కెప్టెన్‌గా ఇదే తన చివరి సీజన్ అని ఐపీఎల్-2021 ద్వితీయార్ధంలో విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. అంటే ఐపీఎల్-2022లో ఆర్‌సీబీకి విరాట్ కెప్టెన్‌గా ఉండడు. కోహ్లి తర్వాత, అతని స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరు తెరపైకి వచ్చింది. అయితే డివిలియర్స్ శుక్రవారం అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో మరోసారి ఆర్‌సీబీ సారథిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రశ్న ఏమిటంటే, ఇద్దరు పాత సహచరులు కెప్టెన్సీ రేసులో లేనప్పుడు RCB ఎవరి నాయకత్వంలో తదుపరి IPL సీజన్ ఆడుతుంది?

ఈ రేసులో ప్రస్తుతం ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్‌వెల్ పేరు తెరపైకి వచ్చింది. మ్యాక్స్‌వెల్ ఈ సీజన్‌లో RCB తరపున బ్యాటింగ్‌తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్, డివిలియర్స్ తర్వాత అతను జట్టులో అత్యంత ముఖ్యమైన బ్యాట్స్‌మెన్‌గా మారాడు. డివిలియర్స్ నిష్క్రమణ తర్వాత, RCB అతనిని కొనసాగించాలని కోరుకుంటుంది. అయితే మ్యాక్స్‌వెల్ కెప్టెన్ అయినా ఆశ్చర్యం లేదు.

IPL-2021లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్.. పంజాబ్‌ను విడిచిపెడతాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే, RCB తదుపరి సీజన్ కోసం మెగా వేలంలో అతనిపై ఓ కన్నేస్తుందని తెలుస్తోంది. అలాగే ఆర్‌సీబీ కెప్టెన్‌గా చేసేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇంతకుముందు రాహుల్ ఆర్సీబీ నుంచే పంజాబ్ టీంకు వెళ్లాడు.

2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఐపీఎల్ టైటిల్‌కు తీసుకెళ్లిన డేవిడ్ వార్నర్, RCB దృష్టిని ఆకర్షించే మరో పేరుగా వార్తల్లో నిలిచింది. వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించిన హైదరాబాద్.. ఆ తర్వాత చివరి-11లో అవకాశం కూడా ఇవ్వకపోవడంతో.. అతడి పేరును వేలంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. వార్నర్ ఆకట్టుకునే కెప్టెన్, బ్యాట్స్‌మెన్ అని నిరూపించుకున్నాడు. RCB అతనిని తమతో పాటు తీసుకెళ్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా RCB రేసులో ఉన్నాడు. అతను IPL-2020లో RCB తరపున ఆడాడు. కానీ 2021లో మాత్రం కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం RCBకి కెప్టెన్ కావాలి. అతని బ్యాట్‌తో అద్భుతాలు చేస్తాడు. అందుకే ఫించ్ ఎంపికకు ఆర్‌సీబీ ప్రాధన్యాం ఇవ్వవచ్చు.





























