ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన దక్షిణాఫ్రికా గ్రేట్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ శుక్రవారం క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికాడు. డివిలియర్స్ 2018లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు, అయితే అతను ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. ఇందులోభాగంగా, అతను విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నాడు. అతను IPL-2021లో కూడా ఆడాడు. డివిలియర్స్ 2008 నుంచి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తన IPL కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ, నాల్గవ సీజన్‌లో అతను RCBతో బరిలోకి దిగాడు. ఈ బ్యాట్స్‌మెన్ ఐపీఎల్ కెరీర్‌ను పరిశీలిస్తే, 184 మ్యాచ్‌లు ఆడి 39.70 సగటుతో 5162 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను మూడు సెంచరీలు, 40 అర్ధ సెంచరీలు చేశాడు. ఐపీఎల్‌లో డివిలియర్స్ టాప్-5 ఇన్నింగ్స్‌ల గురించి ఓసారి తెలుసుకుందాం.