- Telugu News Photo Gallery Cricket photos India Vs New Zealand: TeamIndia Former Skipper MS Dhoni plays tennis at Ranchi stadium might come to cheer team india vs New Zealand
India Vs New Zealand: రాంచీ స్టేడియానికి చేరుకున్న మహేంద్ర సింగ్ ధోనీ.. కారణం ఏంటంటే?
Ms Dhoni: టీ20 ప్రపంచకప్ నుంచి టీమ్ ఇండియా నిష్క్రమించిన తర్వాత, జట్టుకు మెంటార్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని (ఎంఎస్ ధోని) నవంబర్ 9న రాంచీకి తిరిగి వచ్చాడు.
Updated on: Nov 18, 2021 | 8:46 PM

టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రాంచీకి తిరిగి వచ్చాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా శుక్రవారం రెండో టీ20 మ్యాచ్‌ని టీమిండియా ఆడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ చూసేందుకు ధోనీ స్టేడియానికి రావచ్చని భావిస్తున్నారు.

ధోనీ బుధవారం రాంచీలోని స్టేడియానికి చేరుకున్నాడు. అక్కడ అతను టెన్నిస్ ఆడుతూ కనిపించాడు. ధోనీ తన పారా-మిలటరీ శాండో (వెస్ట్)లో కనిపించాడు. స్టేడియంలో ధోనీని చూసి అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ సహాయ్ మాట్లాడుతూ ధోని టెన్నిస్ ఆడేందుకు స్టేడియానికి వచ్చారని, అయితే ధోనీ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి నిర్ధారించలేనని అన్నారు.

స్టేడియం చీఫ్ పిచ్ క్యూరేటర్ శ్యామ్ బహదూర్ సింగ్ పిచ్ పరిస్థితిని వివరిస్తూ రాంచీలో భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్ ప్రారంభం కాగానే మంచు ప్రభావం కనిపిస్తుందని, అందుకే టాస్ పాత్ర ముఖ్యమైందని తెలిపాడు. అదే సమయంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని అభివర్ణించాడు. మ్యాచ్ జరిగే పిచ్‌ను ఈ ఏడాది జులైలో ఉపయోగించారు.

జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ ఈ మ్యాచ్ కోసం 100 శాతం ప్రేక్షకుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే, ఈ సమయంలో కరోనా ప్రోటోకాల్‌ను జాగ్రత్తగా చూసుకుంటామని సంజయ్ సహాయ్ స్పష్టం చేశారు. వీక్షకులందరూ RTPCR నెగిటివ్ నివేదిక, టీకా ప్రమాణపత్రాన్ని చూపవలసి ఉంటుంది. మ్యాచ్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇందులో అత్యంత ఖరీదైన టికెట్ రూ. 9 వేలు కాగా, చౌకైన టికెట్ రూ. 999గా ఉంది.





























