Fact Check: కేంద్ర ప్రభుత్వం మహిళల ఖాతాల్లో రూ.2.20 లక్షలు జమ చేస్తోందా..? ఇందులో నిజమెంత..?

Fact Check: అప్పుడప్పుడు కొన్ని కొన్ని వీడియోలు , ఫోటోలు వైరల్‌ అవుతుంటాయి. అవి నిజం కాకుండా కొందరు సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అవి తెగ వైరల్‌ అవుతుంటాయి...

Fact Check: కేంద్ర ప్రభుత్వం మహిళల ఖాతాల్లో రూ.2.20 లక్షలు జమ చేస్తోందా..? ఇందులో నిజమెంత..?
Fact Check
Follow us

|

Updated on: Nov 19, 2021 | 2:31 PM

Fact Check: అప్పుడప్పుడు కొన్ని కొన్ని వీడియోలు , ఫోటోలు వైరల్‌ అవుతుంటాయి. అవి నిజం కాకుండా కొందరు సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అవి తెగ వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వాటిని చాలా మంది నమ్ముతుంటారు. ఒక యూట్యూబ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రధాన మంత్రి నారీ శక్తి యోజన కింద కేంద్ర ప్రభుత్వం మహిళలందరికి రూ.2.20 లక్షల నగదును అందిస్తోందని ఈ వైరల్‌ సారాంశం. ఈ వీడియోను చూసిన వారంతా నిజంగానే కేంద్ర ప్రభుత్వం మహిళలందరికి రూ.2.20 లక్షలు ఖాతాల్లో జమ చేస్తుందని నమ్ముతున్నారు. ఈ పోస్టుపై స్పందించిన పీఐబీ ప్యాక్ట్ చెక్ అబద్దమని తేల్చి చెప్పింది. అలాంటి రూ.2.20 లక్షలు వచ్చే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని స్పష్టం చేసింది. దీనిని ఎవ్వరు కూడా నమ్మవద్దని ట్వీట్‌ ద్వారా తెలిపింది.

వైరల్‌ వీడియోలో ఏం ఉంది.. ప్రధాన మంత్రి నారీ శక్తి యోజన కింద కేంద్ర ప్రభుత్వం మహిళలందరికి 2 లక్షల 20 వేల రూపాయల నగదుతో పాటు 25 లక్షల రూపాయల రుణం కూడా అందస్తోందని ఉంది. దేశంలో మహిళల కోసం ప్రభుత్వం ఎలాంటి హామీ, వడ్డీ లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తోందని ఈ వీడియోలో పేర్కొన్నారు. అయితే ఈ వైరల్‌ అవుతున్న వీడియో పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పూర్తిగా నకిలీదని తెలిపింది. ఇలాంటి వీడియోలను నమ్మి మోసపోవద్దని సూచించింది.

ప్రభుత్వ విధానాలు లేదా పథకాలపై తప్పుడు సమాచారంపై పీఐబీ తనిఖీ చేసి వాస్తవాలను వెల్లడిస్తుంది. దీని ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు ఆ సంస్థ ఇలాంటి పోస్టులపై కన్నేసి వాస్తవాన్ని తెలియజేస్తుంది. ఇలాంటివి ఏవైనా వీడియోలు గానీ, ఫోటోతో ఉన్న పోస్టులు గానీ వైరల్‌ అవుతుంటే ఫోన్‌ నంబర్‌ 8799711259 లేదా socialmedia@pib.gov.in ఇమెయిల్ ఐడికి ఫిర్యాదు చేయవచ్చు లేదా మీరు అలాంటి సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా కూడా పంపవచ్చు.

ఇవి కూడా చదవండి:

Digilocker: మీ ఫోన్‌లో ఈ ఒక్క యాప్‌ ఉంటే చాలు.. అన్ని డాక్యుమెంట్లు భద్రంగా దాచుకోవచ్చు..!

Reliance Jio: డేటా డౌన్‌లోడ్‌ వేగం.. అగ్రస్థానంలో రిలయన్స్‌ జియో..!