SBI ATM: ఎస్‌బీఐ కొత్త ఏటీఎం కోసం ఏ బ్రాంచ్‌ నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చా..? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్‌..!

SBI ATM: ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్‌ అకౌంట్‌ కలిగి ఉంటున్నారు. గతంలో డబ్బులు డ్రా చేసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లి వోచర్‌ రాసి తీసుకునేవారు. కానీ అలాంటి..

SBI ATM: ఎస్‌బీఐ కొత్త ఏటీఎం కోసం ఏ బ్రాంచ్‌ నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చా..? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్‌..!
Follow us

|

Updated on: Nov 19, 2021 | 3:45 PM

SBI ATM: ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్‌ అకౌంట్‌ కలిగి ఉంటున్నారు. గతంలో డబ్బులు డ్రా చేసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లి వోచర్‌ రాసి తీసుకునేవారు. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. పెద్ద మొత్తంలో డబ్బులు విత్‌డ్రా చేయాల్సి వస్తే తప్ప బ్యాంకుకు వెళ్లడం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏటీఎంలలో తీసుకుంటున్నారు. ఇక డిజిటల్‌ టెక్నాలజీ రావడంతో ప్రతి ఒక్కరు యూపీఐని ఉపయోగించి ట్రాన్షాక్షన్‌లు జరుపుతున్నారు. అయితే ఎస్‌బీఐ ఏటీఎం పోయినట్లయితే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. తర్వాత ఆ బ్రాంచ్‌కు వెళ్లి ఏటీఎం కోసం దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లో చిరునామాకు వస్తుంది. కానీ బ్రాంచ్‌ ఒక చోటు ఉండి.. కస్టమర్‌ మరో చోట ఉంటే కొత్త ఏటీఎం ఎలా దరఖాస్తు చేసుకోవాలి. అలాంటి సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కస్టమర్‌ అకౌంట్‌ ఒక రాష్ట్రంలో ఉండి.. ఆ వ్యక్తి మరో రాష్ట్రంలో ఉన్నప్పుడు కొత్త ఏటీఎం కోసం ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.

కరోనా మహమ్మారి సమయంలో బయటకు రాని పరిస్థితి ఉండటంతో అన్ని బ్యాంకు సేవలు కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకునే సదుపాయాన్ని కల్పించాయి బ్యాంకులు. ప్రస్తుతం ఏటీఎం పోయినా.. ఏటీఎం బ్లాక్‌ అయి కొత్త ఏటీఎం అవసరం వచ్చిన టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. మీది హోమ్‌ బ్రాంచ్‌ ఏది ఉన్నా.. ఇతర బ్రాంచులకు వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) కస్టమర్‌ ట్విటర్‌లో ఓ ప్రశ్నను సంధించారు. ఎస్‌బీఐ కస్టమర్‌ రాష్ట్రంలోని ఏదైనా ఎస్‌బీఐ బ్రాంచ్‌లో కొత్త ఏటీఎం కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అని అడిగాడు. అందుకు ఎస్‌బీఐ స్పందించింది. ఎస్‌బీఐ ఖాతాదారుడు ఏ బ్రాంచ్‌ నుంచైనా ఏటీఎం కార్డు పొందవచ్చు. ఏటీఎం పోయిన తర్వాత మీరు వేరే రాష్ట్రంలో ఉంటే కూడా ఆ రాష్ట్రంలోని ఏదైనా బ్రాంచ్‌కు వెళ్లి కూడా ఏటీఎం కోసం దరకాస్తు చేసుకుని కొత్త ఏటీఎంను పొందవచ్చు అని తెలిపింది. దీని కోసం మీరు తగినన్న పత్రాలు అందించి ఆ ఎస్‌బీఐ బ్రాంచ్‌ నుంచి పని పూర్తి చేయవచ్చు. కావాలనుకుంటే మీరు ఆన్‌లైన్‌లో కూడా ఏటీఎం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సమాధానం ఇస్తూ తెలిపింది ఎస్‌బీఐ.

ఇవి కూడా చదవండి:

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. పాత నంబర్లు, పాత ఛార్జీలతో పట్టాలపైకి..

Fact Check: కేంద్ర ప్రభుత్వం మహిళల ఖాతాల్లో రూ.2.20 లక్షలు జమ చేస్తోందా..? ఇందులో నిజమెంత..?