Gautam Adani: ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టేసి గౌతమ్ అదానీ అత్యంత సంపన్నుడిగా నిలుస్తారా..?
Gautam Adani: భారత్‌లో ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ చాలా కాలంఆ అంత్యంత సంపన్న భారతీయుడిగా కొనసాగుతున్నారు. 2015లో సన్..
Gautam Adani: భారత్‌లో ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ చాలా కాలంఆ అంత్యంత సంపన్న భారతీయుడిగా కొనసాగుతున్నారు. 2015లో సన్ ఫార్మా టాప్ బాస్ దిలీప్ షాంఘ్వీ అంబానీని వెనక్కి నెట్టారు. అయితే 2015 జూన్ నుంచి అంబానీ భారతీయ టెలికాం పరిశ్రమలో విప్లవాన్ని తీసుకువచ్చిన రిలయన్స్ జియో ప్రారంభించిన తర్వాత అత్యంత సంపన్నుడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇక అంబానీకి పోటీగా అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఉన్నారు. ఈయన ప్రస్తుతం అదానీ భారతదేశంలో రెండో ధనవంతుడు మాత్రమే కాకుండా ఆసియాలో రెండో ధనవంతుడిగా కూడా నిలిచారు.
అదానీ ట్రాన్స్‌మిషన్ గత ఏడాదిలో 400 శాతం ఆదాయం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదానీ కంపెనీల షేర్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో అంబానీతో పోటీ పడుతున్నారు. అయితే అదానీ పవర్ నవంబర్ 2020 నుంచి 170 శాతం పెరిగింది. అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఒక సంవత్సరంలో 93 శాతం పెరిగింది. ఇక శుక్రవారం అంటే నవంబర్ 19, 2021 నాటికి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ మొత్తం సంపద 87.4 బిలియన్ డాలర్లు. ముఖేష్ అంబానీకి కేవలం 7 బిలియన్ డాలర్లు 8శాతం తక్కువగా ఉన్నారు. మొత్తం సంపద 94.5బిలియన్ డాలర్లుగా అంచనా ఉంది. గత నెలలో రిలయన్స్ షేర్ ధర రికార్డు స్థాయిలో రూ.2,751.35కి చేరింది.
ఇక ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల బ్లూమ్ బెర్గ్ ర్యాంకింగ్‌లో అంబానీ ఇప్పుడు 12వ స్థానంలో ఉండగా, అదానీ 13వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు అంబానీ సంపద దాదాపు 18 బిలియన్ల డాలర్లు పెరిగింది. అయితే గౌతమ్ అదానీ సంపద అంబానీకి దగ్గరగా ఉన్నారు. అయితే గౌతమ్ అదానీ భారతదేశంలో అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు. అతను ఆస్ట్రేలియాలో వివాదాస్పద బొగ్గు గనుల ప్రాజెక్టు అయిన అబోట్ పాయింట్ కొనుగోలు చేశాడు. ఇండియాలో అత్యంత రద్దీ గల ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో 74 శాతం వాటాను కలిగి ఉన్నాడు. ఏది ఏమైనా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న గౌతమ్ అదానీ అంబానీని అందుకునేందుకు పోటీ పడుతున్నారు. మరి అంబానీనీ అదానీ వెనక్కి నెట్టేస్తారా..? లేదా అనేది మున్ముందు చూడాలి.
ఇవి కూడా చదవండి: