Credit Card: మీరు క్రెడిట్‌ కార్డు తీసుకుంటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోవడం తప్పనిసరి..!

Credit Card: ప్రస్తుతం క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. గతంలో క్రెడిట్‌ కార్డు తీసుకోవాలంటో ఎంతో ప్రాసెస్‌ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేవలం ఫోన్‌ల..

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డు తీసుకుంటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోవడం తప్పనిసరి..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 20, 2021 | 2:12 PM

Credit Card: ప్రస్తుతం క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. గతంలో క్రెడిట్‌ కార్డు తీసుకోవాలంటో ఎంతో ప్రాసెస్‌ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేవలం ఫోన్‌ల ద్వారానే కస్టమర్లను కాంటాక్ట్‌ అయ్యి వాట్సాప్‌, మెయిల్స్‌ ద్వారా పత్రాలను తీసుకుని వెంటనే కార్డు జారీ చేస్తున్నారు. కానీ మొదటి సారిగా క్రెడిట్‌ కార్డు తీసుకునే వారు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. కార్డు పొందే ముందు అందుకు సంబంధించిన నియమ నిబంధనలు తెలుసుకోవడం తప్పనిసరి. క్రెడిట్‌ కార్డు తెలివిగా ఉపయోగించుకుంటే మంచిదే. కానీ నిర్లక్ష్యం చేస్తే అప్పుల పాలు కావాల్సిందే. అయితే క్రెడిట్‌ కార్డులకు కొన్ని ఛార్జీలు ఉంటాయి అలాంటివి తెలుసుకోవడం ఉత్తమం. వార్షిక ఛార్జీలు, పెనాల్టీలు, ఇతర ఛార్జీలు ఉంటాయి వాటిని ముందుగా తెలుసుకోవడం మంచిది.

వార్షిక ఛార్జ్‌: క్రెడిట్‌ కార్డు పొందిన తర్వాత వార్షిక రుసుము ఉంటుంది. మీకు కార్డు ఉచితంగా అందినప్పటికీ, తర్వాత వార్షిక ఛార్జీలను వసూలు చేస్తాయి బ్యాంకులు.

ఆలస్యంగా చెల్లింపులపై ఛార్జీలు: మీరు క్రెడిట్‌ కార్డు తీసుకున్న తర్వాత అందులో వాడిన మొత్తాన్ని గడువులోగా చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే అందుకు పెనాల్టీలు విధిస్తుంటుంది బ్యాంకులు. ఆలస్య రుసుము అనేది గడువు ముగిసిన తర్వాత చెల్లించకుంటే వర్తిస్తాయి.

వడ్డీ ఛార్జీలు: సాధారణంగా బ్యాంకులు బకాయి మొత్తంపై దాదాపు 35 నుంచి 40 శాతం వార్షిక రసుమును వసూలు చేస్తాయి. వడ్డీ లేని కాలం తర్వాత బ్యాంకులు సాధారణంగా వడ్డీ వసూలు చేస్తుంటాయి. ఎప్పుడు కూడా గడువు తేదీని గుర్తించుకుని బకాయి ఉన్న మొత్తాన్ని ముందుగానే చెల్లించడం మంచిది.

నగదు నిర్వహణ చార్జీలు: క్రెడిట్‌ కార్డు వినియోగదారులు ఏటీఎంల నుంచి కూడా డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకు కొంత మొత్తాన్ని కేటాయిస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేయవద్దు. అలా చేసినట్లయితే మీకు భారీగా పెనాల్టీ పడుతుంది. కాబట్టి క్రెడిట్‌ కార్డును ఉపయోగించి ఏటీఎంల నుంచి నగదును విత్‌డ్రా చేయవద్దు.

జీఎస్టీ: క్రెడిట్‌ కార్డు కస్టమర్లు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం.. అన్ని క్రెడిట్‌ కార్డు లావాదేవీలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం చార్జ్‌ బిల్‌ చేసిన విలువపై 18 శాతం ఉంటుంది.

ఓవర్‌ డ్రాప్ట్‌ చార్జ్‌: క్రెడిట్‌ కార్డు వినియోగదారులు వారి నెలవారీ క్రెడిట్‌ పరిమితిని అధిగమించినప్పుడు ఓవర్‌ డ్రాప్ట్‌ ఛార్జీలు వర్తించబడతాయి.

నిపుణులు ఏమంటున్నారంటే.. క్రెడిట్‌ కార్డులు వాడే వారు జాగ్రత్తగా ఉండాలి. తెలివిగా వాడుకుంటే మంచిది. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎక్కువగా వాడి తర్వాత బకాయి చెల్లించే ముందు ఇబ్బందులు పడితే మరింత నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. క్రెడిట్‌ కార్డు తీసుకునే ముందు అన్ని రకాల ఛార్జీలను ముందుగానే పరిశీలించాలి. లేకపోతే అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణుడు నీలోత్‌పాల్‌ బెనర్జీ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Nominee: బ్యాంకు ఖాతా.. వివిధ స్కీమ్‌లలో చేరితే నామినీ పేరు ఎందుకు చేర్చాలి? ఒక వేళ నమోదు చేయకపోతే ఏమవుతుంది?

Post Office Account: ఇందులో రూ.500తో ఖాతా ఓపెన్‌ చేయవచ్చు.. మంచి రాబడి, భద్రతా ప్రయోజనాలు..!

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..