AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola Electric: ఎలక్ట్రిక్‌ వాహనాల టెస్ట్‌ రైడ్లలో దూసుకుపోతున్న ఓలా.. వాహనదారులకు గుడ్‌న్యూస్‌..!

Ola Electric: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరల కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకు తగినట్లుగానే పలు వాహన కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌..

Ola Electric: ఎలక్ట్రిక్‌ వాహనాల టెస్ట్‌ రైడ్లలో దూసుకుపోతున్న ఓలా.. వాహనదారులకు గుడ్‌న్యూస్‌..!
Subhash Goud
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 20, 2021 | 7:06 PM

Share

Ola Electric: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరల కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకు తగినట్లుగానే పలు వాహన కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. మొదట దేశంలో ఓలా ఎలక్ట్రిక్‌ వాహనం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆ సంస్థ వాహనాల కొనుగోలుదారులకు శుభవార్త అందించింది. నవంబర్‌ 10వ తేదీ నుంచి ఓలా ఎలక్ట్రిక్‌ వాహనాలను టెస్ట్‌ రైడ్‌కు అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్‌ డ్రైవ్‌ ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఓలా ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌ వంటి నగరాలకే పరిమితమైంది.

రెండు వేరియంట్లలో ఓలా స్కూటర్స్‌..

ఓలా ఈ -స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఓలా ఎస్1, ఎస్1 ప్రో. ఇక ఓలా ఎస్ 1 ధర రూ. 1,41,400- ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉండగా, సబ్సిడీ రూపంలో.99,999లతో అందుబాటులో ఉంది. ఓలా ఎస్1 ప్రో రూ .1,29,999లలో లభించనుంది. కేంద్రం అందించే సబ్సిడీలతో పలు రాష్ట్రాల్లో ధరల్లో మార్పులుంటాయి.

ఈ నగరాల్లో టెస్ట్‌ రైడ్లు

ఓలా ఎస్‌1, ఓలా ఎస్‌1 ప్రో వాహనాలను పలు ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురానుంది. విశాఖ, విజయవాడ, తిరువనంతపురం, భువనేశ్వర్‌, వడోదర, తిరుప్పూర్‌, జైపూర్‌, కోయంబత్తూర్‌, నాగ్‌పూర్‌ ప్రాంతాల్లో టెస్ట్ రైడ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. డిసెంబర్‌ 15 నాటికి సుమారు వెయ్యి నగరాలకుపైగా వాహనాలను విస్తరించనున్నట్లు ఓలా సీఈవో భవీస్‌ అగర్వాల్‌ అన్నారు. ఈ ఎలక్ట్రిక్‌ వాహనాలకు మంచి స్పందన వస్తోందని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు

27 నుంచి మరిన్ని నగరాల్లో టెస్ట్‌ రైడ్లు:

ఇక దేశ వ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్‌ వాహనాలను విస్తరించాలనే ఉద్దేశంలో పనులను వేగవంతం చేస్తోంది కంపెనీ. ఇక నవంబర్‌ 19 నుంచి హైదరాబాద్‌, ముంబై, చెన్నై, కొచ్చి, పుణే నగరాల్లో టెస్ట్‌రైడ్లను ప్రారంభించింది. నవంబర్‌ 27వ తేదీ నుంచి మరిన్ని నగరాల్లో టెస్ట్‌ రైడ్లను నిర్వహించాలని భావిస్తోంది.

ఫుల్ ఛార్జ్‌తో ఓలా S1 డ్రైవింగ్ రేంజ్ 181 కి.మీ:

ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీష్ అగర్వాల్ వెల్లడించిన వివరాల మేరకు S1 స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు 181 కి.మీ. చేరుకోగలదు. అలాగే S1 స్కూటర్ కేవలం 3 సెకన్లలో 0 kmph నుంచి 40 kmph వరకు వెళ్లగలదని గతంలో అగర్వాల్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనం గరిష్టంగా 115 కి.మీ వెళ్లగలదని ఆయన వెల్లడించారు.

ఛార్జింగ్ సమయం:

ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లు కేవలం 18 నిమిషాల్లో 50 శాతం వరకు ఈ-స్కూటర్‌ను ఛార్జ్ చేసుకోవచ్చని ఓలా కంపెనీ తెలిపింది. రెగ్యులర్ ఛార్జింగ్ స్టేషన్‌లో, ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుంచి ఫుల్ ఛార్జ్ కావడానికి 2.5 గంటలు పడుతుంది. ఇంట్లో ఒక సాధారణ ప్లగ్‌తో 5.5 గంటల సమయం పడుతుంది.

50 శాతం ఛార్జ్‌తో..

ఓలా ఈ-స్కూటర్ 50శాతం ఛార్జ్‌తో 75 కిమీ వరకు ప్రయాణం చేయగలదని వెల్లడించింది. ఇది ఫుల్‌గా ఛార్జ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ 150 కిమీ ప్రయాణం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ వాహనం 3.4kWh బ్యాటరీని కలిగి ఉంది.

ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్ కలర్స్:

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. నీలం, నలుపు, ఎరుపు, గులాబీ, పసుపు, తెలుపు, సిల్వర్ షేడ్స్‌లో మ్యాట్, గ్లోస్ ఎంపికల్లో ఉండనున్నాయి. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మెరుగైన సేవలందించేందుకు ఓలా ఈ-స్కూటర్ మూడు విభిన్న వేరియంట్లలో లభించనుంది. మరిన్ని రంగుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

PM SVANidhi: వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. ఈ స్కీమ్‌ కింద దరఖాస్తు చేసుకుంటే సులభంగా రుణాలు..!

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డు తీసుకుంటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోవడం తప్పనిసరి..!