AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: ఆనీ మాస్టర్ ఎలిమినేట్.. ఒక్కొక్కరికి గురించి ఏం చెప్పిందంటే..

బిగ్‏బాస్ సీజన్ 5 సండే ఫండ్ ఎపిసోడ్ ఫన్నీగా సాగింది.. అలాగే ఎలిమినేషన్ ప్రక్రియ జరిగిపోయింది. అయితే గత వారం రోజులుగా

Bigg Boss 5 Telugu: ఆనీ మాస్టర్ ఎలిమినేట్.. ఒక్కొక్కరికి గురించి ఏం చెప్పిందంటే..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Nov 22, 2021 | 6:58 AM

Share

బిగ్‏బాస్ సీజన్ 5 సండే ఫండ్ ఎపిసోడ్ ఫన్నీగా సాగింది.. అలాగే ఎలిమినేషన్ ప్రక్రియ జరిగిపోయింది. అయితే గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగానే పదవకొండవ వారంలో ఆనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యింది. ఇక నిన్నటి ఎపిసోడ్‎లో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో వచ్చిన అనుభవించు రాజా టీంకు వచ్చి కాస్త ఎంటర్ టైన్ చేసింది. ఇక సండే ఫన్ డేలో భాగంగా ఇంటి సభ్యులతో వివిధ రకాల గేమ్స్ ఆడించారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ ఒకరి గురించి మరొకరిని ప్రశ్నలు అడిగారు నాగ్.. ఈ క్రమంలో శ్రీరామ్ నటిస్తున్నాడని.. అతడికి చాలా ముఖాలు ఉన్నాయని అడగ్గా.. అలా ఏంలేదని చెప్పుకొచ్చారు. ఇక షణ్ముఖ్ వలన సిరి ఆటలో వెనకబడుతుందా ? సిరి, షణ్ముఖ్ ముందుగా అనుకుని బిగ్ బాస్ కు వచ్చారా అనే ప్రశ్నలను వేశారు.

ఇక ప్రియాంకతో నీ ఫ్యూచర్ రిలేషన్ ఏంటని అడగ్గా.. ఫ్రెండ్స్ అంటూ తెల్చేశాడు మానస్. ఇక మానస్ నుంచి ఏ ఎక్స్పెక్ట్ చేస్తున్నావని ప్రియాంకను అడగ్గా.. ఫ్రెండ్ షిప్ అని బదులిచ్చింది. అలాగే సిరి వెనకాల జోక్స్ వేస్తావని ప్రియాంకను అడగ్గా.. ముందు వేసేవి .. వెనకాల కూడా వేస్తాను అని బదులిచ్చింది. అలాగే ఈ బ్రెయిన్ ఎప్పుడు ఉపయోగిస్తావు.. టైటిల్ గెలవడానికి వచ్చావా ? గెలిపించడానికి వచ్చావా ? అని అడగ్గా.. గెలవడానికే అంటూ చెప్పుకొచ్చాడు సన్నీ. ఇక టాస్కుల మధ్యలో ఒక్కొక్కరిని సేవ్ చేసిన నాగ్… చివరకు ఆనీ మాస్టర్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు. ఇక ఎలిమినేషన్ అనంతరం స్టేజ్ పైకి వచ్చిన ఆనీ మాస్టర్ హౌస్ మేట్స్ తో మాట్లాడింది.

ఇంట్లో తనకు మంచి తమ్ముడిగా రవి ఉన్నాడని.. శ్రీరామ్ ఫ్రెండ్ అని తెలిపింది. ఇక షణ్ముఖ్ నిజాయితిగా మాట్లాడతాడు అని సిరి పటాకలా ఆడుతుందని చెప్పింది. అలాగే ప్రియాంక సీతాకోక చిలుక అని కాంప్లిమెంట్ ఇచ్చింది. బయటకు వచ్చాకా మానస్ తో ఫ్రెండ్ అవుతాను అని చెప్పింది. ఇక తన ఫ్రెండ్ సన్నీ అని… అతడిని మిస్ అవుతాను అని తెలిపింది. కాజల్ గురించి చెప్పడానికి ఏం లేదని చెప్పింది.

Also Read: Kaikala Satyanarayana: విషమంగానే కైకాల సత్యనారాయణ ఆరోగ్యం.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల

Telugu Singer: తెలుగునాట అద్భుతమైన పాటలు పాడుతూ దూసుకుపోతున్న ఈ సింగర్ ఎవరో గుర్తుపట్టారా..?

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్