Telugu Singer: తెలుగునాట అద్భుతమైన పాటలు పాడుతూ దూసుకుపోతున్న ఈ సింగర్ ఎవరో గుర్తుపట్టారా..?

తెలుగులో ఇప్పుడు గాయనీ, గాయకులకు కొదవ లేదు. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పుణ్యమా అని ఎంతోమంది ఇప్పుడూ తెలుగనాట సింగర్లుగా రాణిస్తున్నారు.

Telugu Singer: తెలుగునాట అద్భుతమైన పాటలు పాడుతూ దూసుకుపోతున్న ఈ సింగర్ ఎవరో గుర్తుపట్టారా..?
Ramya Behara
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 21, 2021 | 6:39 PM

తెలుగులో ఇప్పుడు గాయనీ, గాయకులకు కొదవ లేదు. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పుణ్యమా అని ఎంతోమంది ఇప్పుడూ తెలుగనాట సింగర్లుగా రాణిస్తున్నారు. పదులు సంఖ్యలో తెలుగు చిత్రపరిశ్రమలో సింగర్స్ రాణించగలుతున్నారంటే.. బాలు గారు అన్నీ తానై నడిపించిన పాడుతా తీయగా ప్రొగ్రాం పుణ్యమని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్ సింగర్లలో ఒకరిగా ఉన్నారు రమ్య బెహరా. ఈ యువ గాయని గుంటూరు జిల్లా నరసరావుపేటలో 1994, ఫిబ్రవరి 1 జన్మించింది. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లో. ఈమెకు ఇద్దరు అక్కలు ఉన్నారు. రమ్య బెహరా రామాచారి గారి వద్ద సంగీత పాఠాలు నేర్చుకుంది. ఆపై వివిధ పాటల పోటీల్లో పాల్గొని మంచి పేరు సంపాదించుకుంది. టీవీ ప్రొగ్రామ్స్‌లో సైతం అదరగొట్టింది. దేశ, విదేశీ సంగీత కచేరిల్లో పాల్గొని.. తన గాత్రంతో శ్రోతలను అలరించింది.  ఈ క్రమంలో దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారి మెప్పు పొంది.. ఎన్నో గొప్ప పాటలను పాడింది. కీరవాణి గారే రమ్య బెహరాను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. వెంగమాంబ సినిమాతో ఆమె పాటల ప్రయాణం ప్రారంభమైంది. ఆపై లచ్చిందేవికి ఓ లెక్కుంది, కృష్ణాష్టమి, బ్రూస్ లీ,  బాహుబలి ది బిగినింగ్, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లౌక్యం, కొత్తజంట, చిన్నదాన నీకోసం, దిక్కులు చూడకు రామయ్య, ఇస్మార్ట్ శంకర్, రెడ్, రంగ్ దే, శతమానం భవతి  సినిమాలలో మంచి పాటలు పాడింది. ఈమె ప్రస్తుతం కొన్ని కన్నడ, తమిళ్, హిందీ సినిమాలలో కూడా పాడుతుంది.

అద్భుతమైన గాత్రం మాత్రమే కాదు.. ఆకట్టుకునే అందం కూడా రమ్య బెహరా సొంతం. అందుకే ఆమెకు యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కాగా రమ్య బెహరా సూపర్ సింగర్ 4లో పాల్గొన్నప్పటి ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఆమెను చూసిన నెటిజన్లు అసలు గుర్తించలేకపోతున్నారు. ఈమె మన రమ్య బెహరానేనా అని కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Ramya Behara (@ramyabehara)

Also Read: మైక్‌ టైసన్‌ గురించి సంచలన సీక్రెట్.. రింగ్‌లోకి దిగటానికి ముందు శృంగారం.. అదీ ఒకరిద్దరితో కాదు

బైక్​పై వెళ్తుండగా ఆగిన గుండె.. క్షణాల్లోనే ఊపిరి పోయిన వైనం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!