Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Eligible Bachelor: ఆహాలో రికార్డులు బద్దలుకొడుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌.. ఎంతమంది వీక్షించారంటే..?

Most Eligible Bachelor in Aha: తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఆహా.. అస‌లు సిస‌లైన తెలుగు వినోదానికి ఇంటికి పేరుగా మారింది. ఇప్పటికే సూపర్ హిట్ సిమాలను, అదిరిపోయే గేమ్ షోలను,

Most Eligible Bachelor: ఆహాలో రికార్డులు బద్దలుకొడుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌.. ఎంతమంది వీక్షించారంటే..?
Most Eligible Bachelor In A
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 21, 2021 | 6:19 PM

Most Eligible Bachelor in Aha: తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఆహా.. అస‌లు సిస‌లైన తెలుగు వినోదానికి ఇంటికి పేరుగా మారింది. ఇప్పటికే సూపర్ హిట్ సిమాలను, అదిరిపోయే గేమ్ షోలను, ఆకట్టుకునే టాక్ షోలను అందిస్తున్న ఆహా సూపర్ హిట్ మూవీ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌` ని రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆహాలో న‌వంబ‌ర్ 19 శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే న‌టించిన ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెర‌కెక్కించారు. కాగా.. ఆహాలో రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ సినిమా దూసుకుపోతోంది. రెండురోజుల్లోనే 10 కోట్ల (100 మిలియన్లు) నిమిషాల వ్యూస్ వచ్చినట్లు తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఆహా వెల్లడించింది. ఓటీటీలో సినిమా దూసుకెళ్తున్నట్లు వెల్లడించింది. ఆహా యూజర్లు అత్యధికంగా సినిమాను వీక్షించినట్లు సంస్థ ఆదివారం ట్విట్ చేసి వెల్లడించింది.

అద్భుత‌మైన పెర్ఫార్మెన్స్.. మోడ్రన్ డేస్ రిలేష‌న్‌షిప్స్ మీద ఫోక‌స్‌తో బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ సినిమాను తెరకెక్కించారు. అంతేకాకుండా గోపీసుంద‌ర్ మ్యూజిక్‌ కూడా బాగా ఆకట్టుకుంటోంది. సినిమా రిలీజ్ కాగానే విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. అక్కినేని అఖిల్, పూజా హెగ్డే కాంబినేషన్‌ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ప్రేమ గురించి, బంధాల గురించి ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఆధునిక జీవితంలో చాలా మంది ఫేస్ చేస్తున్న రిలేష‌న్‌షిప్ ఇష్యూస్‌ని.. సెన్సిటివ్‌గా తెరకెక్కించారు. ఈసినమాలో ఆమ‌ని, ముర‌ళీశ‌ర్మ, జ‌య‌ప్రకాష్‌, గెట‌ప్ శీను, సుడిగాలి సుధీర్‌, ప్రగతి కీల‌క పాత్రల్లో న‌టించారు. ఈ సినిమా బిగ్‌ స్క్రీన్‌తోపాటు.. ఓటీటీలో రికార్డ్స్ క్రియేట్ చేస్తూ.. ప్రేక్షకుల మది దోచుకుంటోంది.

Also Read:

Rajamouli-Mahesh: మహేష్‌ చిత్రం కోసం తమిళ స్టార్‌ హీరోను దింపనున్న రాజమౌళి.? విలన్‌ పాత్ర కోసమే..

Amitabh Bachchan: పాన్‌ మసాల బ్రాండ్‌‌పై బిగ్‌బీ సీరియస్.. లీగల్‌ నోటీసులు పంపిన అమితాబ్ బచ్చన్