Colliers India: నిరుద్యోగులకు అలెర్ట్.. రియల్ ఎస్టేట్ కంపెనీలో 1000 ఉద్యోగ అవకాశాలు..!
Colliers India: భారతదేశంలో తన వ్యాపారాన్ని విస్తరించడానికి దూకుడు వ్యూహాలను అనుసరిస్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సలహా సంస్థ కొలియర్స్ వచ్చే ఏడాది 1,000 మంది ఉద్యోగులను
Colliers India: భారతదేశంలో తన వ్యాపారాన్ని విస్తరించడానికి దూకుడు వ్యూహాలను అనుసరిస్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సలహా సంస్థ కొలియర్స్ వచ్చే ఏడాది 1,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని నిర్ణయించుకుంది. కెనడాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ కొలియర్స్ యొక్క భారతీయ అనుబంధ సంస్థ అయిన కొలియర్స్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రమేష్ నాయర్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జనవరిలో కంపెనీ రెండు కొత్త సేవలను ప్రారంభించబోతోందని వెల్లడించారు. అంతేకాకుండా భారతదేశంలో సుమారు 1,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనుంది. ఇది భారత మార్కెట్‌లో విస్తరించేందుకు కంపెనీ దూకుడు వ్యూహంలో భాగం అని అన్నారు. లాభదాయకత పరంగా దేశంలోని మొదటి మూడు రియల్ ఎస్టేట్ అడ్వైజరీ సంస్థల్లో కొలియర్స్ ఇండియాను ఒకటిగా మార్చాలనే లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యూహాన్ని అనుసరించినట్లు నాయర్ తెలిపారు. కాగా.. నాయర్ ఈ ఏడాది జూలైలో ఈ కంపెనీకి సీఈఓగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా నాయర్ మాట్లాడుతూ.. శ్రామిక శక్తిని పెంచడం, సరైన పని సంస్కృతిని అలవర్చుకోవడం, బ్రాండ్‌ను మార్కెట్ చేయడం, వినూత్న సాంకేతికతలను అమలు చేయడం, కస్టమర్ బేస్‌ను పెంచుకోవడం చాలా ముఖ్యం అని అన్నారు.
అన్ని పోస్టుల్లో కొత్త ఉద్యోగుల నియామకం.. ఇందుకోసం అన్ని స్థాయిల్లో కొత్త ఉద్యోగుల నియామకం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం కొలియర్స్ ఇండియాలో దాదాపు 3,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది కొత్తగా వెయ్యి రిక్రూట్‌మెంట్లు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 2022 జనవరిలో రెండు కొత్త సర్వీసులను ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలుచేస్తుందని నాయర్ తెలిపారు.
కోవిడ్-19 నుంచి రియల్ ఎస్టేట్ రంగం కోలుకుంటోంది.. కోవిడ్-19 మహమ్మారి షాక్ నుండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం చాలా వరకు కోలుకుంటున్నట్లు కనిపిస్తోందని నాయర్ పేర్కొన్నారు. రెసిడెన్షియల్ సెక్టార్‌తో పాటు ఆఫీసులు, షాపింగ్ మాల్స్‌లోనూ అభివృద్ధి సంకేతాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ వ్యాక్సినేషన్ వేగం, మెరుగైన ఆర్థిక పరిస్థితులు బలపడుతున్నాయని ఆయన అన్నారు.
Also Read: