AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goutham Raju: సినిమా ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ ఎడిటర్‌ గౌతమ్‌రాజు కన్నుమూత..

Goutham Raju Demise: సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతంరాజు (Goutham Raju) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన..

Goutham Raju: సినిమా ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ ఎడిటర్‌ గౌతమ్‌రాజు కన్నుమూత..
Goutham Raju
Basha Shek
| Edited By: |

Updated on: Jul 06, 2022 | 6:38 PM

Share

Goutham Raju Demise: సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌రాజు (Goutham Raju) (68) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన  హైదరాబాద్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సినిమా ఇండస్ట్రీలో 800 కు పైగా చిత్రాలకు ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహించిన ఘనత ఆయన సొంతం. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ సినిమాల్లో కూడా పనిచేశారు. ఖైదీ నెంబర్‌ 150, గబ్బర్‌ సింగ్, కాటమరాయుడు, కిక్‌, రేసుగుర్రం, గోపాలగోపాల, అదుర్స్‌, బలుపు, రచ్చ, ఊసరవెల్లి, బద్రీనాథ్‌, మిరపకాయ్‌, కృష్ట, డాన్‌ శీను, సౌఖ్యం, డిక్టేటర్‌ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలకు గౌతంరాజు ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహించారు.  ఇక  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన  ‘ఆది’ చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా నంది పురస్కారం అందుకున్నారు. ఇలాంటి అవార్డులు ఆయన ఖాతాలో చాలానే ఉన్నాయి. 68 ఏళ్ల వయసున్న ఆయన మరణానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  కాగా ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్‌రాజు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి  తెలియజేస్తున్నారు.

Whatsapp Image 2022 07 06 At 6.51.49 Am

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్