Goddess Kali:: ముదురుతున్న వివాదం.. తగ్గేదే లే అంటున్న డైరెక్టర్ లీనా..

లీనా మణిమేకల డైరెక్షన్లో కాళీ పేరుతో తెరకెక్కుతున్న డాక్యూమెంటరీ వివాదాస్పదం అయింది. తాజాగా ఈ డాక్యూమెంటరీ నుంచి రిలీజైన కాళీమత ఫోటో చూసి హిందుత్వ సంఘాలు భగ్గుమన్నాయి. కాళీ మాత సిగరెట్ తాగటం ఏంటని.. డైరెక్టర్ ను ప్రశ్నిస్తున్నాయి..

Goddess Kali:: ముదురుతున్న వివాదం.. తగ్గేదే లే అంటున్న డైరెక్టర్ లీనా..
Leena Manimekalai
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 05, 2022 | 8:54 PM

లీనా మణిమేకల(Leena Manimekala) డైరెక్షన్ లో కాళీ(Goddess Kali) పేరుతో తెరకెక్కుతున్న డాక్యూమెంటరీ వివాదాస్పదం అయింది. తాజాగా ఈ డాక్యూమెంటరీ నుంచి రిలీజైన కాళీమత ఫోటో చూసి హిందుత్వ సంఘాలు భగ్గుమన్నాయి. కాళీ మాత సిగరెట్ తాగటం ఏంటని.. డైరెక్టర్ ను ప్రశ్నిస్తున్నాయి. ఆమె పై సీరియస్ అవుతున్నాయి. అయితే డైరెక్టర్ లీనా మాత్రం వారి ప్రశ్నలను పక్కకు పెట్టేశారు. తన డాక్యూమెంటరీ పై జరుతున్న వివాదాన్ని లైట్ తీసుకున్నారు. అసలు కాళీ మాత సిగరెట్ పట్టుకోవడంలో తప్పేముందని హిందుత్వ సంఘాలను తిరిగి ప్రశ్నిస్తున్నారు. వాక్‌ స్వాతంత్య్రం  కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్దమే కాని.. ఈ వివాదం పై వెనక్కి తగ్గేది మాత్రం లేదంటూ చెబుతున్నారు. సమాన హక్కుల కోసం ఈ డాక్యూమెంటరీ తీశానన్నారు. కెనడా ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ ఫీచర్ ఫిల్మ్ ను స్క్రీనింగ్ కూడా చేస్తున్నట్టు చెప్పారు లీనా..!

ఇక డైరెక్టర్ లీనా మాటలతో వివాదం మరింతగా ముదిరింది. దీంతో హిందుత్వ సంఘాలు పోలీస్‌ స్టేషన్లో ఆమెపై కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలోనూ దాడి చేస్తున్నారు. ఇక ఢిల్లీలోని ఓ పోలీస్‌ స్టేషన్లో ఇప్పిటికే ఈమెపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. హిందూ దేవతను అత్యంత దారుణంగా కించపర్చారంటూ హిందూ సంఘాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లీనా పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. హిందువుల మనోభావాలు గాయపర్చిన లీనాను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి హిందూ సంఘాలు. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి