God Father: యూట్యూబ్‌ను ఏలేస్తున్న మెగాస్టార్.. ‘గాడ్ ఫాదర్’కు నెట్టింట యమక్రేజ్
మెగాస్టార్ చిరు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నారు. పర్పెక్ట్ స్వింగ్‌తో.. సూపర్ స్టైల్ అండ్ బిల్డప్ తో గాడ్ ఫాదర్‌గా వచ్చేస్తున్నారు. అదే గ్రేస్‌తో యూట్యూబ్‌లో కూడా రికార్డులెవల్ వ్యూస్‌ను సాధించేస్తున్నారు.
మెగాస్టార్ చిరు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నారు. పర్పెక్ట్ స్వింగ్‌తో.. సూపర్ స్టైల్ అండ్ బిల్డప్ తో గాడ్ ఫాదర్(God Father)గా వచ్చేస్తున్నారు. అదే గ్రేస్‌తో యూట్యూబ్‌లో కూడా రికార్డులెవల్ వ్యూస్‌ను సాధించేస్తున్నారు. చిరు మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్. మోహన్ రాజా డైరెక్షన్లో మలయాళం లూసీఫర్ కు రిమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా చిరు ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇప్పటికే చిరు బర్త్‌డే సందర్భంగా గాడ్ ఫాదర్ టైటిల్ వీడియోను రిలీజ్ చేసిన మేకర్స్.. జెస్ట్ చిరు ఫస్ట్ లుక్‌తో యూట్యూబ్ వెంట పడేలా చేస్తున్నారు. దీంతో మెగాస్టార్ చిరు గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ జెస్ట్ రిలీజైన 23 గంట్లలోనే 1.6 మిలియన్ వ్యూస్ ను సాధించేసింది. అంతేకాదు. 40.6k వ్యూ పర్ హవర్ వ్యూస్ తో యూట్యూబ్లో దూసుకుపోతోంది.
ఇక బ్లాక్ కలర్ అంబాసిడర్లో.. దిగిన గాడ్ ఫాదర్ .. బ్లాక్ డ్రెస్ లో.. బ్లాక్ షేడ్స్ లో.. నెరిసిన గడ్డంతో యామా కూల్ గా కనిపించడం అందరికీ కిక్కిస్తోంది. సునీల్ కారు డోర్ తీయగా దిగిన చిరు.. తన స్టైల్ ఆఫ్ మూవ్స్ తో ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ తెంపించడం.. కంటిన్యూ అవుతూనే ఉంది. ఇదిలాగే కంటిన్యూ అయితే.. చిరు సినిమాల్లోనే.., ఫస్ట్ లుక్ తో ఎక్కువ వ్యూస్ సాధించిన సినిమాగా గాడ్ ఫాదర్ రికార్డులకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సల్మాన్ ఈ మూవీలో పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్‌పై వచ్చే సన్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని చిత్రయూనిట్ చెబుతోంది. తెలుగులో సల్మాన్‌ఖాన్ నటించడం ప్రత్యేకత సంతరించుకుంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లు ఇద్దరూ ఒకేచోట కనిపించడం అభిమానులకు పండుగే. ఈ సినిమాలో మెగాస్టార్ సిస్టర్ గా నయన తార నటిస్తోన్నారు.