Samantha: ఆ ప్రేమకు సమంత ఎమోషనల్.. వాళ్ల ప్రేమ చూసి కన్నీళ్లు పెట్టుకున్న సామ్.. వీడియో వైరల్..
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్లలో సమంత ఒకరు. దక్షిణాదిలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది సామ్. ఇటీవలే నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సామ్.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరి సరనస సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా నిలిచింది సామ్. అయితే కొన్నాళ్లుగా సామ్ పర్సనల్ లైఫ్ ఒడిదుడుకులతో సాగుతున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత మానసిక ఒత్తిడి.. మయోసైటిస్ సమస్యతో పోరాడుతుంది సామ్. దీంతో కొన్ని నెలలుగా ఆమె సినిమాల్లో నటించడం లేదు. ఆరోగ్యం పూర్తిగా శ్రద్ధ తీసుకున్న సామ్.. ఇన్నాళ్లు విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం అటు సినిమాలను ఒప్పుకుంటూ.. అలాగే ఇటు నిర్మాతగానూ మారింది.
ఇదిలా ఉంటే.. ఇటీల తమిళ చిత్రపరిశ్రమలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సామ్.. అక్కడ అభిమానుల ప్రేమ చూసి ఎమోషనల్ అయ్యింది. సమంత స్టేజ్ పైకి వెళ్లగానే.. ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ అక్కడున్న ఫ్యాన్స్ సమంత పేరును గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. అభిమానుల ప్రేమ చూసి సామ్ భావోద్వేగానికి గురయ్యింది. ఆ తర్వాత నవ్వుతూ.. అవును సమంత.. ఇది నా పేరు అంటూ కళ్ల నిండా నీళ్లతో బదులు ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
సమంత తమిళంలో చివరిసారిగా కతువాకుల రెండు కాదల్ మూవీలో కనిపించింది. సమంత అథర్వ నటించిన ‘బానా కాతడి’ సినిమాతో తమిళ సినిమాలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తమిశంసో విజయ్, సూర్య, ధనుష్, శివకార్తికేయన్, విజయ్ సేతుపతిల సరసన నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇప్పుడిప్పుడే సామ్ తిరిగి సినిమాల్లో యాక్టివ్ అవుతుంది.
— videobackup (@videobacku14271) March 20, 2025
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..