Constable Movie : కంబ్యాక్ గ్యారెంటీ.. కానిస్టేబుల్ నా కెరీర్‌కు మరో మలుపు: వరుణ్ సందేశ్
హ్యాపీడేస్ సినిమాతో హీరోగా పరిచయమైన వరుణ్ సందేశ్…ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో వరుణ్ కు మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. కానీ ఆ తర్వాత అతడు నటించిన చిత్రాలన్ని డిజాస్టర్స్ అయ్యాయి.దీంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో నటిస్తున్న వరుణ్.. తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు.

వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా తెరకెక్కుతున్న చిత్రం “కానిస్టేబుల్”. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో ఈ చిత్రంలోని ఓ ఐటమ్ సాంగ్ ను తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ చేతులమీదుగా విడుదల చేశారు. అనంతరం భరత్ భూషణ్ స్పందిస్తూ, చిత్రం విజయవంతం కావాలని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, సెన్సార్ విజయవంతంగా పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందడం చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్ కు ఈ చిత్రం మరో మలుపు అవుతుందని అన్నారు.
ఇది కూడా చదవండి :ఈ ఫొటోలో ఉన్న అన్న చెల్లెల్లు.. ఇప్పుడు టాలీవుడ్ హీరో, హీరోయిన్స్.. ఎవరో తెలుసా.?
నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ, సెన్సార్ పూర్తి కావడం, అలాగే ట్రైలర్ కి వచ్చిన స్పందన నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ నెల్ల 10న ఇలాంటి ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల తీర్పు కోసం వస్తున్నామని చెప్పారు. అలాగే ఇందులోని ఒక మంచి ఐటమ్ సాంగ్‌ను దసరా సందర్భంగా విడుదల చేశాం. దానికి కూడా మంచి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు.
ఇది కూడా చదవండి :ఒకే ఒక్క డిజాస్టర్ పడింది..! దెబ్బకు ఏడాదికి పైగా కనిపించకుండా పోయింది..
దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ, సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంది. ట్రైలర్ కు వచ్చిన స్పందనతోనే మేము సగం విజయం సాధించామని అనుకుంటున్నాం. 50 లక్షల మంది ట్రైలర్ చూడడం అంటే అది మామూలు విషయం కాదని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు తారాగణం.
ఇది కూడా చదవండి : బుర్రపాడు సిరీస్ బ్రో.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్ లు.. ఎక్కడ చూడొచ్చంటే
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




