Sharwanand: డివైడర్‌ను ఢీ కొట్టిన శర్వానంద్ కారు.. గాయాలతో హాస్పటల్‌కు..
యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి శర్వానంద్ కారును కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే ప్రమాద సమయంలో కారులో శర్వానంద్ లేడని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురైందని తెలుస్తోంది. శర్వానంద్ కారు రేంజ్ రోవర్ హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్‌లోని జంక్షన్ దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి శర్వానంద్ కారును కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే ప్రమాద సమయంలో కారులో శర్వానంద్ లేడని వార్తలు వచ్చాయి. కానీ ఆయన కారులోనే ఉన్నారని, స్వల్ప గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకొని శర్వాని హాస్పటల్ కు తీసుకెళ్లారని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. టాలీవుడ్ లో శర్వానంద్ హీరోగా దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఇటీవలే శర్వానంద్ కు ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే యూఎస్ లో సాఫ్ట్ వేర్ గా ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షితారెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం జరిగింది. రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న లీలా ప్యాలెస్ వీరి వివాహనికి వేదిక కానుంది. జూన్ 2, 3 తేదీల్లో గ్రాండ్ గా వివాహ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శర్వానంద్ కారుకు ప్రమాదం జరిగిందని తెలియడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.