Siddu Jonnalagadda: డీజే టిల్లు సరసన స్టార్ హీరోయిన్ సమంత.. దర్శకత్వం ఎవరంటే
ఇప్పటికే డీజే టిల్లు సీక్వెల్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. దాంతో పాటే.. చిరు సినిమాలో ఆఫర్ కొట్టేసి నిన్న మొన్నటి వరకు నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇప్పుడేమో.. ఏకంగా సమంత పక్కనే హీరోగా బుక్ అయి అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు ఈ బాయ్.

రీసెంట్ డేస్లో బంపర్ ఆఫర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతున్నారు డీజే టిల్లు అలియాస్ సిద్దు జొన్నలగడ్డ. డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమాకు త్వరలోనే సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే డీజే టిల్లు సీక్వెల్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. దాంతో పాటే.. చిరు సినిమాలో ఆఫర్ కొట్టేసి నిన్న మొన్నటి వరకు నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇప్పుడేమో.. ఏకంగా సమంత పక్కనే హీరోగా బుక్ అయి అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు ఈ బాయ్.
ఎట్ ప్రజెంట్ డీజే టిల్లు సీక్వెల్ షూట్లో బిజగా ఉన్న సిద్దూ జొన్నల గడ్డ.. త్వరలో యంగ్ డైరెక్టర్ నందిని డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారు. అయితే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ ఫేజ్లో ఉన్న ఈ మూవీలో హీరోయిన్గా సమంతను ఫైనలైజ్ చేశారట డైరెక్టర్ నందిని రెడ్డి.
ఇక ఇదే విషయం ఇప్పుడు అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. డీజే టిల్లు పక్కన సమంత హీరోయిన్ గా చేస్తుండడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది. సిద్దూ కు ఇది బంపర్ ఆఫర్ అనే కామెంట్ కూడా నెట్టింట కనిపించేలా చేస్తోంది.