Mahesh Babu : సినిమాతారలను వదలని మహమ్మారి.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా పాజిటివ్
సూపర్ స్టార్ మహేష్ బాబు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా కల్లోలంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సినిమా తారలు వరుసగా కరోనా బారిన పడుతుండటం కలవరం రేపుతోంది. ఇప్పటికే చాలా మంది సినిమాతారలు కరోనా బారిన పడుతున్నారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఈ వైరస్ బాధితుల జాబితాలో చేరుతున్నారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కొవిడ్‌కు గురవుతున్నారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది ఈ విషయాన్నీ మహేష్ స్వతహాగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డానని.. స్వల్ప లక్షణాలతో హోమ్ ఇసో లేషన్ లో ఉన్నానని పేర్కొన్నారు మహేష్. అలాగే గత కొద్దీ రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్‌లు చేసుకోవాలని కోరారు మహేష్. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరలోనే తిరిగి షూటింగ్ కు వెళ్లాలని ఎదురుచూస్తున్నానని తెలిపారు మహేష్ బాబు. మహేష్‌కు కరోనా అని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మహేష్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.
— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2022