Rajeev Rayala |
Updated on: Jan 06, 2022 | 9:09 PM
టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సమంత. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది సామ్.
ఆ తర్వాత అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట 2021లో విడాకులు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు
విడాకుల అనంతరం సామ్ తన కెరీర్ పై దృష్టి సారించింది. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యింది
ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అదుర్స్ అనిపించుకుంది సామ్.
ఇటీవలే యశోధ మూవీకి సంబంధించిన షెడ్యూల్ను పూర్తిచేసింది. అటు బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది సమంత
ఆ మంచులో సాహసక్రీడల్లో పాల్గొంటోంది. స్కీయింగ్ చేస్తూ ఉల్లాసంగా కాలాన్ని గడుపుతోంది.
సామ్ చేసిన ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా సమంత తన ఇన్ స్టా ఖాతాలో మరో పోస్ట్ చేసింది.
ఇప్పటికే 'శాకుంతలం' 'కాతు వాకుల రెండు కాదల్' వంటి రెండు సినిమాలను పూర్తి చేసిన సామ్.. ప్రస్తుతం 'యశోద' అనే పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో పాల్గొంటోంది.