kantara: కాంతార సినిమాపై యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ ట్వీట్.. మా ఊరి సంప్రదాయాన్ని స్ర్కీన్‌పై చూశానంటూ
స్వీటీ అనుష్క, కోలీవుడ్ స్టార్ ధనుష్, ప్రభాస్, కంగనా రనౌత్ లాంటి సెలబ్రిటీలు కాంతారా సినిమాను చూసి సూపర్బ్ అంటూ తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ సినిమాను వీక్షించారు.
కాంతార.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తుంది. కన్నడనాట ఓ చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలెక్షన్లు కొల్లగొడుతోంది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించాడు. కన్నడిగుల సంప్రదాయమైన భూత కోల ఆచారం నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా కాంతార సినిమాను తెరకెక్కించారు. విడుదలైన ప్రతిచోటా వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్వీటీ అనుష్క, కోలీవుడ్ స్టార్ ధనుష్, ప్రభాస్, కంగనా రనౌత్ లాంటి సెలబ్రిటీలు కాంతారా సినిమాను చూసి సూపర్బ్ అంటూ తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ సినిమాను వీక్షించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా ‘నేను చిన్నప్పుడు మా ఊరిలో చూసిన కల్చర్‌ను ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూడటం చాలా బాగా అనిపించింది’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
200 కోట్ల వైపు అడుగులు.. కాగా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన కాంతారా రూ.200 కోట్లవైపు దూసుకెళుతోంది. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లోనూ ఈ చిత్రానికి వసూళ్ల వర్షం కురుస్తోంది. కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ నిర్మించిన హోంబలే ఫిల్మ్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ నటించింది. కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు.
Nenu chinnapati nunchi maa urilo chusina culture ni screenpaina chudadam chala baga anipinchindi ??@shetty_rishab ???@hombalefilms @GeethaArts #kanthara pic.twitter.com/uD4nAWSL5R
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 22, 2022
ఇక కిరణ్ విషయానికొస్తే.. ఇటీవల నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ తదితర సినిమాలు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..