Mega 154: మెగా ఫ్యాన్స్‌కు ముందుగానే దీపావళి.. అదిరిపోయిన మెగా 154 ఫస్ట్ గ్లింప్స్.. పూనకాలు తెచ్చేలా చిరు స్టైల్
దీపావళి పండగను పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం.
గాడ్‌ఫాదర్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీరయ్య (ప్రచారంలో ఉన్న పేరు) గా అభిమానుల ముందుకు వస్తున్నాడు. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మాస్ మహరాజా రవితేజ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మెగా154 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్, టీజర్లు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాయి. కాగా దీపావళి పండగను పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. దీవాళి సందర్భంగా అక్టోబర్ 24న ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు టైటిల్ టీజర్ రిలీజ్ చేయబోతోన్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే దీనికంటే ముందు మెగాఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేలా ఒక చిన్న అప్డేట్ ఇచ్చారు. సోమవారం రావాల్సిన టైటిల్ టీజర్ కంటే.. ముందే తాజాగా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఇందులో పంచెకట్టుతో మెగాస్టార్ స్టైల్, సిగరెట్ తాగే విధానం, డీఎస్పీ బీజీఎం.. ఇలా అన్నీ అదిరిపోయాయి. ప్రస్తుతం మెగా 154 అప్డేట్ నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతోంది. మరి ఫస్ట్ గింప్లే ఈ రేంజ్‌లో ఉంటే రేపు రాబోతున్న టైటిల్ టీజర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు. కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, యెర్నేనీ రవిశంకర్, మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగాఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అని టైటిల్ పెట్టినప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. రేపు ఫుల్ క్లారిటీ రానుంది.
MEGA MASS EXPLOSION in 24 Hours ??
We are Ready To Make Your Diwali Sparkle Even Brighter with #Mega154 Title Teaser Tomorrow at 11.07 AM ❤️?
Poonakalu Loading ??
Megastar @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl @shrutihaasan @ThisIsDSP @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/kWTdZuMfJM
— Bobby (@dirbobby) October 23, 2022
Stay tuned ?#Mega154 https://t.co/vW1sfYrYil
— Bobby (@dirbobby) October 23, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..