AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: ఫుల్ జోష్‌‌‌‌లో దూసుకుపోతున్న రవితేజ… మాస్ మహారాజకు జోడీగా మరోసారి ఆ బ్యూటీ..

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న రవితేజ. ఇటీవల సరైన హిట్ లేక కాస్త సతమతమయ్యాడు.

Ravi Teja: ఫుల్ జోష్‌‌‌‌లో దూసుకుపోతున్న రవితేజ... మాస్ మహారాజకు జోడీగా మరోసారి ఆ బ్యూటీ..
Ravi Teja
Rajeev Rayala
|

Updated on: Apr 10, 2021 | 7:48 AM

Share

Ravi Teja: మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నరవితేజ ఆ మధ్య సరైన హిట్ లేక కాస్త సతమతమయ్యాడు. కానీ ఈ ఏడాది ప్రారంభంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్నాడు. క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన మాస్ రాజా వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రవితేజ.’క్రాక్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, ‘రాక్ష‌సుడు’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెర‌కెక్కించిన ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఖిలాడి’‌. ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రానికి స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మాత‌. డా. జ‌యంతీలాల్ గ‌డ స‌మ‌‌ర్ప‌ణ‌లో ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మే 28న ‘ఖిలాడి’ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ఇట‌లీలోని అంద‌మైన లొకేష‌న్ల‌లో జ‌రుగుతోంది. ఈ సినిమాతోపాటు త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో, అలాగే మారుతి డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నాడు. వీటితోపాటుగా ఓ కొత్త దర్శకుడికి కూడా ఛాన్స్ ఇచ్చాడని టాక్ . ఈ మూడు సినిమాలో ఒక సినిమాకు హీరోయిన్ గా నాభ నటేష్ ఎంపిక చేసారని ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. గతంలో రవితేజ హీరోగా నటించిన ‘డిస్కో రాజా’ సినిమాలో నభనటేష్ హీరోయిన్ గా నటించింది. మరోసారి ఈ జంట వెండితెరపై సందడి చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది నభ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vakeel Saab: ‘కుళ్లు రాజకీయాలు మానేయాలి’.. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాపై సంచలన కామెంట్ చేసిన హీరోయిన్..

కాఫీ వ్యక్తిగా మారిన కాజల్‌ అగర్వాల్‌..! గ్రీన్‌ టీ నుంచి అటువైపు ఎందుకు మళ్లిందో తెలుసా..?

Balakrishna Movie : ఉగాది రోజున BB3 అఫీషియల్‌ టైటిల్‌..? ఇక బాలకృష్ణ ఫ్యాన్స్‌కి పండగే.. చూసుకోండి..!

Follow Us