AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

A.R. Rahman: ఎ.ఆర్‌.రెహమాన్‌ని వర్చువల్‌గా కలిసే అద్భుత అవకాశం.. ఎలా అంటే

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాంబినేష‌న్‌లో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం `99 సాంగ్స్‌`.. 99 సాంగ్స్ కవర్‌స్టార్‌ కోసం హిందీ, తమిళ్‌, తెలుగులో ఎంట్రీస్‌ని ఆహ్వానిస్తున్నారు.

A.R. Rahman: ఎ.ఆర్‌.రెహమాన్‌ని వర్చువల్‌గా కలిసే అద్భుత అవకాశం.. ఎలా అంటే
Ar Rahman
Rajeev Rayala
|

Updated on: Apr 10, 2021 | 8:15 AM

Share

A.R. Rahman 99 songs: ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాంబినేష‌న్‌లో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం `99 సాంగ్స్‌`.. 99 సాంగ్స్ కవర్‌స్టార్‌ కోసం హిందీ, తమిళ్‌, తెలుగులో ఎంట్రీస్‌ని ఆహ్వానిస్తున్నారు. 99 సాంగ్స్ సౌండ్‌ ట్రాక్‌ల్లో తమ ఫేవరేట్‌ ట్రాక్‌ని రికార్డు చేసి కవర్‌ని పోస్ట్ చేయాల్సిందిగా ఆయన తన సోషల్‌ మీడియా అకౌంటుల ద్వారా పిలుపునిచ్చారు. కళాకారులు తమ కవర్స్ ను హిందీ, తమిళ్‌, తెలుగులో యుట్యూబ్‌లోగానీ, ఇన్‌స్టాగ్రామ్‌లోగానీ #99SongsCoverStar అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి పోస్ట్ చేయాలన్నారు. అలాగే @arrahman అనే హ్యాష్‌ట్యాగ్‌ని వాడాలని పిలుపునిచ్చారు. ఇందులో ఎంపికైన విజేతలు ఎ.ఆర్‌.రెహమాన్‌ని వర్చువల్‌గా కలిసే అవకాశం ఉంది. అలాగే 99 సాంగ్స్ టీమ్‌ని కూడా కలవవచ్చు. అంతే కాదు ఎంపికైన వారిలో ఒకరికి ఎ.ఆర్‌.రెహమాన్‌తో కొలాబరేట్‌ అయ్యే లక్కీ ఛాన్స్ కూడా వెయిట్‌ చేస్తోంది. ఇప్పటికే ఈ విషయం తెలిసిన నెటిజన్లు, ఆర్టిస్టులు తమ ప్రతిభనంతా చూపిస్తున్నారు. ఎంట్రీలు భారీగా అందుతున్నాయి. 99 సాంగ్స్ చిత్రాన్ని హిందీ, తమిళ్‌, తెలుగులో ఈ నెల 16న విడుదల చేయనున్నారు. జియో స్టూడియోస్‌ సమర్పిస్తోంది. ఎ.ఆర్‌.రెహమాన్‌ ప్రొడక్షన్‌ కంపెనీ, వై యం మూవీస్‌ నిర్మిస్తోంది. ఐడియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సహ నిర్మిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ravi Teja: ఫుల్ జోష్‌‌‌‌లో దూసుకుపోతున్న రవితేజ… మాస్ మహారాజకు జోడీగా మరోసారి ఆ బ్యూటీ..

Vakeel Saab: ‘కుళ్లు రాజకీయాలు మానేయాలి’.. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాపై సంచలన కామెంట్ చేసిన హీరోయిన్..

కాఫీ వ్యక్తిగా మారిన కాజల్‌ అగర్వాల్‌..! గ్రీన్‌ టీ నుంచి అటువైపు ఎందుకు మళ్లిందో తెలుసా..?

Follow Us