వరుణ్-కృతి జోడీ సూపర్బ్.. ప్రకృతి అందాల సందర్శనలో బిజీ.. ఇన్‌స్టాలో వీడియో పోస్ట్..

Bollywood Actor Kriti Sanon : తెలుగులో మహేశ్ బాబుతో ‘1 నేనొక్కడినే’, నాగచైతన్యతో ‘దోచెయ్’ సినిమాలు చేసిన హాట్ బ్యూటీ కృతిసనన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది.

  • uppula Raju
  • Publish Date - 5:21 am, Sat, 10 April 21
వరుణ్-కృతి జోడీ సూపర్బ్.. ప్రకృతి అందాల సందర్శనలో బిజీ.. ఇన్‌స్టాలో వీడియో పోస్ట్..
Actor Kriti Sanon

Bollywood Actor Kriti Sanon : తెలుగులో మహేశ్ బాబుతో ‘1 నేనొక్కడినే’, నాగచైతన్యతో ‘దోచెయ్’ సినిమాలు చేసిన హాట్ బ్యూటీ కృతిసనన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో ‘సీత’గా చాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ..‘అక్షయ్ పాండే, హౌస్‌ఫుల్ ఐదో సీజ‌న్, గ‌న‌ప‌థ్, మిమి, హ‌మ్ దో హ‌మారే దో’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తోంది. కాగా చేతినిండా సినిమాలతో ఉన్న కృతినే ప్రస్తుతం నెం.1 హీరోయిన్ అని సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతానికి శ్రుతి.. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘భేడియా’ షూటింగ్‌లో పాల్గొంటుండగా, అరుణాచల్ ప్రదేశ్‌లో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో మూవీ యూనిట్ సభ్యులు అక్కడి పర్యాటక ప్రదేశాలను చుట్టొచ్చారు. ఆ విశేషాలను ‘లవ్ ఇట్’ అనే క్యాప్షన్‌తో తన ఇన్‌స్టా వేదికగా తెలియజేసిన కృతి.. ‘అరుణాచల్ సుందర అడవులు, కొండలతో పాటు చంద్రుడి ప్రతిబింబం’తో కూడిన వీడియోను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ‘అద్భుతమైన ప్రదేశం, సుందర సుమధుర దృశ్యాలు, వరుణ్-కృతి జోడీ సూపర్బ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అమర్ కౌశిక్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిషేక్ బెనర్జీ కీలక పాత్ర పోషిస్తున్నారు.

తెలుగులో సరైన విజయాలు లేకపోవడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ అయిపోయింది. కాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమా అప్డేట్స్ తో పాటు హాట్ హాట్ ఫోటోలను , వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల ఈ బ్యూటీ రాసిన కవిత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ అమ్మడు గతంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటిస్తున్న బచ్చన్ పాండే సినిమాలో నటిస్తుంది కృతిసనన్.

 

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon)

Best Online Business Ideas: ఇంట్లో కూర్చొని కేవలం రూ. 5 వేల పెట్టుబడితో లక్షలు సంపాదించండి..

నిరుద్యోగులు అలర్ట్..! యూనివర్సిటీ పోస్టులకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల వర్తింపు.. టీఎస్‌పీఎస్‌సీ తాజా నిర్ణయం..